‘రాబిన్‌హుడ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ రాబిన్‌హుడ్‌తో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు, గతంలో తనతో బ్లాక్‌బస్టర్ భీష్మ చిత్రాన్ని తీసిన వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల నితిన్ సరసన నటిస్తోంది. మేకర్స్ ఈ చిత్రం విడుదల తేదీని అనౌన్స్ చేశారు.

రాబిన్‌హుడ్ మార్చి 28న థియేటర్లలోకి రానుంది, సమ్మర్ రిలీజ్ లో ఇది బిగ్గెస్ట్ ఎట్రాక్షన్. రిలీజ్ డేట్ పోస్టర్‌లో నితిన్ స్లీక్ స్పెషల్ ఏజెంట్ అవతార్‌లో డైనమిక్ గా కనిపించారు.

సినిమా ప్రమోషన్స్  త్వరలో కిక్ స్టార్ట్ కానున్నాయి. కేతికా శర్మ నటించిన సెకండ్ సింగిల్ కొన్ని రోజుల్లో విడుదల కానుంది, ఈ చిత్రానికి  జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు. ఫస్ట్ సింగిల్, గ్లింప్స్ , మిగతా ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన స్పందన వచ్చింది.

నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు. కోటి ఎడిటర్, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్.

తారాగణం: నితిన్, శ్రీలీల, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: వెంకీ కుడుముల
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
CEO: చెర్రీ
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: సాయి శ్రీరామ్
ఎడిటర్: కోటి
ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరి తుమ్మల
లైన్ ప్రొడ్యూసర్: కిరణ్ బళ్లపల్లి
ఫైట్స్: రామ్-లక్ష్మణ్, రవివర్మ, విక్రమ్ మోర్
పబ్లిసిటీ డిజైనర్: గోపి ప్రసన్న
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో