ఎపిసోడ్ 2: Weapon: ఓపెనింగ్ ఏ రాజీ(సమంత) ని ఇంట్రడ్యూస్ చేశారు. బస్సు లో ప్రయాణిస్తున్న రాజీని వెనక ఒకడు మోలెస్టేట్ చేస్తూ ఉంటాడు. ఏమి చేయలేని రాజీ ఆ బాధని భరిస్తుంది. సుబ్బు మరణానికి ప్రతీకారం కోసం రెబల్ టైగర్ భాస్కరన్, isi సమీర్ తో కలిసి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ బసుపై ఎటాక్ చేయడానికి లండన్ నుంచే ప్లాన్ చేస్తాడు. ఈ విషయం ఇండియన్ ఏజెన్సీ డీకోడ్ చేసి బసుకి చెప్తారు. ప్రమాదం పొంచి ఉంది కాబట్టి కొన్ని రోజుల పాటు బసుని పబ్లిక్ మీటింగ్ కి దూరంగా ఉండమని చెప్తుంది. మొండిఘటం అయిన ప్రైమ్ మినిస్టర్ బసు, శ్రీలంకన్ ప్రెసిడెంట్ తో మీటింగ్ ని సుబ్బు చనిపోయిన చెన్నైలోనే ఫిక్స్ చేస్తుంది. చేసేదేమి లేక ఇండియన్ టాస్క్ ఏజెన్సీ హెడ్ కులకర్ణి తన బెస్ట్ టీంని చెన్నై పంపిస్తాడు.
శ్రీకాంత్ ముంబైలో అదే సిస్టమ్, భార్యతో గొడవ, ఇంట్లో కోల్పోయిన ప్రశాంతత కోసం చేయాల్సిన పనులు అన్నీ చేస్తూ ఉంటాడు. ఎపిసోడ్ స్టార్టింగ్ లో కనిపించిన సమంత మళ్లీ అదే బస్సులో కనిపిస్తుంది. ఫ్యాక్టరీలో పని డ్యూటీ పూర్తి చేసుకోని తిరిగి వెళ్తున్న రాజీకి ఉదయం తనని అసభ్యంగా టచ్ చేసిన వాడే మళ్ళీ టచ్ చేయడం మొదలుపెడతాడు. రాజీ బస్సు దిగి వెళ్ళిపోతుంది, అతను కూడా రాజీని ఫాలో అవుతూ బస్సు దిగి వెనకే వెళ్తాడు. కాస్త దూరం నడిచి వెళ్లిన రాజీ, చుట్టూ ఎవరూ లేరు అనే విషయం గమనించి, వెనక వచ్చే వాడిని దారుణంగా కొట్టి చంపుతుంది. రాజీని సీరియస్ మోడ్ లో చూపించడం ఇదే మొదటిసారి. తిరిగి ఇంటికి వచ్చిన రాజీ, టీవిలో తమ నాయకుడు సుబ్బు మరణ వార్త చూసి తాను ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అవుతుంది. తమిళ టైగర్ గానే చనిపోవాలి అనుకున్న రాజీ, పెట్టెలో నుంచి యూనిఫామ్ తీసి వేసుకోని అద్దం ముందు నిలబడి తనని తాను చేసుకోని తమిళ టైగర్ల స్వాతంత్ర పాట పడుతుంది. ఇక రాజీ సైనేడ్ తీసుకోని చనిపోవడమే లేట్ అనుకుంటున్న టైములో రాజీకి సెల్వ అనే నాయకుడు నుంచి ఫోన్ వస్తుంది. భాస్కరన్ ఒక మిషన్ ని రెడీ చేశాడు, దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యతని రాజీకి చెప్పడానికి సెల్వ ఫోన్ చేస్తాడు. రాజీని ఇమ్మీడియేట్ గా ఉద్యోగం మానేయమని చెప్పిన సెల్వ, మరుసటి రోజు తనని కలవమని చెప్తాడు. సెల్వ, మిషన్ నువ్వు రెడీగా ఉన్నావ్ కదా అని రాజీని అడగడంతో… తమిళతల్లి ఆయుధాన్ని నేను, తమిళ గౌరవాన్ని నిలబెడతాను, తమిళతల్లి కోసం ప్రాణాలైనా ఇస్తాను అనే పవర్ ఫుల్ డైలాగ్ చెపుతుంది. ఇక్కడితో ఎపిసోడ్ హై నోట్ లో ఎండ్ అవుతుంది.
సెకండ్ ఎపిసోడ్ మొత్తం సమంత చుట్టూనే తిరుగుతుంది. తమిళ టైగర్ అయిన సమంత, చెన్నైకి మకాం మార్చి ఇక్కడ ఒక పరిశ్రమలో చిన్నపాటి ఉద్యోగం చేస్తూ ఉంటుంది. రాజీ పాత్ర కోసం సమంత చూపించిన చేంజ్ ఓవర్ చాలా కొత్తగా ఉంది. ముఖ్యంగా ఎపిసోడ్ ఎండ్ లో తను చెప్పే ఆ సీరియస్ డైలాగ్ గూస్ బంప్స్ తెచ్చేలా ఉంది. తన తమిళ డైలాగ్ డెలివరీ కానీ దెబ్బతిన్న పులిలా ఉన్న ఆమె కళ్లు కానీ షోని కంప్లీట్ గా స్టీల్ చేశాయి.