‘యానిమల్’ లోని ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది – యానిమల్ చిత్ర యూనిట్

రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘యానిమల్’ ప్రమోషనల్ కంటెంట్ తో సెన్సేషన్ సృష్టించింది. ఇటివలే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచింది. ‘యానిమల్’లో ర‌ణ్‌బీర్ క‌పూర్ కు జోడిగా ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్ టి-సిరీస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. ఈ చిత్రం డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 5 భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రెస్ మీట్ నిర్వహించింది.

ప్రెస్ మీట్ లో రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమ నాకు ఎంతో ప్రత్యేకం. నా మొదటి సినిమాకి వచ్చినపుడు నా తొలి అటోగ్రాఫ్ హైదరాబాద్ లోనే ఇచ్చాను. ఇక్కడ ప్రేక్షకులు సినిమాల పట్ల చూపించే ప్రేమ ఆదరణ అద్భుతంగా వుంటుంది. తెలుగు రాష్ట్రాల అబ్బాయిగా వుండాలని వుంది. నన్న దత్తత తీసుకోవాలని కోరుతున్నాను( నవ్వుతూ). ఈ చిత్రంలో చాలా విలక్షణమైన పాత్ర చేశాను. నా పాత్ర చాలా ఇంటెన్స్ గా వుంటుంది. తన తండ్రి పట్ల విపరీతమైన ప్రేమ వున్న కొడుకు పాత్రలో కనిపిస్తాను. అలాగే ఈ చిత్రంలో నా భార్య గీతాంజలి పాత్రతో కూడా చాలా ఘాడమైన ప్రేమలో వుంటాను. యానిమల్స్ అన్ ప్రెడిక్ట్బుల్ గా వుంటాయి. ఇందులో నా పాత్ర ఆ స్వభావంతో వుంటుంది. యానిమల్ కథ, పాత్రలు అందరికీ కనెక్ట్ అవుతాయి. చాలా హార్డ్ వర్క్ చేసిన ఈ చిత్రం చేశాం. అందరూ డిసెంబర్ 1న తప్పకుండా యానిమల్ ని చూడాలి” అని కోరారు.

అనిల్ కపూర్ మాట్లాడుతూ.. నా మొదటి చిత్రం వంశవృక్షం ది గ్రేట్ బాపు గారి దర్శకత్వంలో చేశాను. నా ఫౌండేషన్ సౌత్ పరిశ్రమలోనే పడింది. ఇక్కడే అన్నీ నేర్చుకున్నాను. ఇప్పుడు నా రెండో తెలుగు సినిమాగా యానిమల్ విడుదల కావడం ఆనందంగా వుంది. సందీప్ ఈ కథ చెప్పగానే మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నాను. ఈ కథని సందీప్ అద్భుతంగా రాసుకున్నాడు. అందరూ ఇందులో ఎమోషన్స్ కు కనెక్ట్ అవుతారు. రన్బీర్ , రష్మిక, బాబీ అందరికీ కలసి పని చేయడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. చాలా చక్కని నటీనటులు ఇందులో వున్నారు. డిసెంబర్ 1న యానిమల్ ఖచ్చితంగా మీ అందరినీ అలరిస్తుంది” అన్నారు.

ర‌ష్మిక మాట్లాడుతూ.. యానిమల్ నాకు చాలా స్పెషల్ మూవీ. రన్బీర్ తో కలసి నటించడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. తను గొప్ప వ్యక్తిత్వం వున్న నటుడు. సందీప్ గారు ఈ కథను, పాత్రలని అద్భుతంగా మలిచారు. ఇందులో వుండే ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది. అనిల్ కపూర్ బాబి డియోల్ ఇలా చాలా మంది అద్భుతమైన నటులతో కలసి నటించే అవకాశం యానిమల్ సినిమా ఇచ్చింది. ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. డిసెంబర్ 1న అందరూ ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూడాలి’’ అని కోరారు

అనంతరం Q &A ప్రెస్ మీట్ లో మీడియా అడిగిన ప్రశ్నలు చిత్ర యూనిట్ సమాధానాలు ఇచ్చింది.

రణ్‌బీర్ కపూర్ గారు మీ నాన్న గారితో మీ చిన్ననాటి అనుబంధం ఎలా వుండేది ? ఈ పాత్ర చేయడానికి అది తోడ్పడిందా ?
-కొన్నాళ్ళు క్రితమే నాన్న గారిని కోల్పోయాను. నాన్న గారు తన వ్రుత్తి రిత్యా చాలా బిజీగా వుండేవారు. చిన్నప్పుడు ఆయనతో సరదాగా కలసి సమయం గడిపిన సందర్భాలు చాలా ఉన్నప్పటికీ ఇంకా వుంటే బావుండేదనిపిస్తుంది. సందీప్ యానిమల్ కథని చాలా సహజంగా గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా తీశారు. ఆడియన్స్ అందరూ తప్పకుండా కథ, పాత్రలకు కనెక్ట్ అవుతారు.

సందీప్ గారు.. ఇలాంటి విలక్షణమైన పాత్రలను క్రియేట్ చేయడం మీకు ఎలా సాధ్యపడుతుంది ?
-ఎలా సాధ్యపడుతుందో చెప్పలేను. అయితే ప్రేక్షకుల ద్రుష్టిని ఆకర్షించాలంటే కొత్తగా వుండాలి. తండ్రి కొడుకుల కథలు ఎప్పటినుంచో వున్నాయి. అందులో కొత్తదనం చూపించాలంటే ఇంకా లోతుగా వెళ్లి కొత్త కాన్సెప్ట్ పట్టుకోవాలి. అలాంటి ప్రయత్నం యానిమల్ లో చేశాం. తండ్రి కోసం కొడుకు ఎంత దూరం వెళ్ళగలడు అనేది ఈ కథ ప్రధాన సారాంశం.

దిల్ రాజు గారు.. యానిమల్ టికెట్ రేట్స్ మన దగ్గర ఎలా వుంటాయి ?

  • మన దగ్గర ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేశాం. ట్రెమండస్ రెస్పాన్ ఇచ్చారు. అన్ని సినిమాలకు ఎలా ఉంటాయో రిజనబుల్ ధరలోనే వుంటాయి.

సందీప్ గారు.. షాహిద్ కపూర్, రన్బీర్ కపూర్ తో వర్క్ చేశారు కదా..నటన పరంగా ఎలా అనిపించింది ?
షాహిద్ కపూర్ తో చేసింది రిమేక్. దానితో పోలిక తీసుకురాకూడదు. రన్బీర్ మాత్రం అద్భుతం. నాకంటే తను ఏడాది చిన్న లేదంటే తను ఇచ్చిన పెర్ఫార్మెన్స్ కి కాళ్ళు మొక్కాలి. ఆయనతో వర్క్ చేయడం మజా వచ్చింది. రన్బీర్ కి వున్న ఓపిక మరెవరికీ లేదు.

భూషణ్ గారు యానిమల్ ని తెలుగు లో విడుదల చేయడం ఎలా అనిపిస్తుంది ?

  • సందీప్ తో కబీర్ సింగ్ చేశాను. యానిమల్ కథ చెప్పినపుడే చాలా కనెక్టింగా అనిపించింది. తండ్రికొడుకుల అనుబంధం అందరినీ కట్టిపడేస్తుంది. ఇందులో చూసే సన్నివేశాలు ఇదివరకూ ఎప్పుడు చూడని విధంగా సరికొత్తగా వుంటాయి.

అనిల్ కపూర్ గారు.. ఇందులో తండ్రి పాత్రని పోషించడం ఎలా అనిపించింది ?
ఇందులో తండ్రికోడులు బంధం చాలా విలక్షణంగా వుంటుంది. సాధారణంగా తండ్రి ఒక స్థాయికి వచ్చిన తర్వాత కొడుకు తన అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటారు. ఐతే ఇందులో తండ్రిపట్ల కొడుకుకి చాలా గొప్ప ప్రేమ ఉన్నప్పటికీ తన సొంత మార్గంలో నడవాలని అనుకుంటాడు. ఆ సంఘర్షణలో ఇందులో చాలా అద్భుతంగా చూపించడం జరిగింది.

సందీప్ గారు .. రన్బీర్ కి సాఫ్ట్ ఇమేజ్ వుంది కదా అత్నతో యాక్షన్ సినిమా చేయడం ఎలా అనిపించింది ?
రన్బీర్ కి సాఫ్ట్ అనే ట్యాగ్ వేశారు కానీ తను సాఫ్ట్ ఏం కాదు (నవ్వుతూ) రాక్ స్టార్ సినిమాలో ఆయన కళ్ళల్లో రౌద్రం అద్భుతంగా కనిపిస్తుంది.

బాబీ డియోల్ గారు సందీప్ పాత్ర చెప్పినపుడు ఎలా అనిపించింది ?
యానిమల్ లో చాలా అద్భుతమైన పాత్ర చేశాను. ఇలాంటి పాత్రలు జీవితంలో ఒక్కసారే వస్తాయి. సందీప్ చాలా స్ఫూర్తిని ఇస్తారు. ఆయన వలనే తెరపై పాత్రలన్నీ ఇంత అద్భుతంగా వచ్చాయి.

దిల్ రాజు గారు యానిమల్ తో జాక్ పాట్ కొట్టారని అనుకుంటున్నారా ?
అర్జున్ రెడ్డి మిస్ అయ్యాను . అప్పటి నుంచి సందీప్ సినిమా కోసం ప్రయత్నిస్తున్నాను. భూషణ్ గారికి థాంక్స్. ఆయన బర్త్ డే గిఫ్ట్ నాకు ఇచ్చారు. వాళ్ళు నమ్మి ఈ సినిమా మా చేతిలో పెట్టారు. తెలుగు ఖచ్చితంగా వండర్స్ క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నాను. ట్రైలర్ చూశాక అది ఇంకా డబుల్ అయ్యింది. పెద్ద స్థాయిలో ఈ సినిమా తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

ప్రణయ్ గారు యానిమల్ ఏ స్థాయిలో వుంటుందని అనుకుంటున్నారు ?
సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. సినిమా హిట్ అవుతుంది. ఐతే అది ఏ స్థాయిలో వెళుతుందననేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. ఖచ్చితంగా సినిమా బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తుంది.