పాదయాత్ర చేస్తాను అంటున్న ‘ఉక్కు సత్యాగ్రహం’ చిత్ర దర్శక హీరో

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేందుకు చేసిన ప్రజా ఉద్యమాలు, నాయకుల త్యాగాలు ఉక్కు సత్యాగ్రహం చిత్రానికి `ప్రేరణ అని చిత్ర నిర్మాత, దర్శకుడు, హీరో సత్యారెడ్డి చెప్పారు . విశాఖలోని చిత్రాలయా ఐనాక్స్ లో ఉక్కు సత్యాగ్రహం చిత్రాన్ని శుక్రవారం మధ్యాహ్నం సిపిఎం నాయకులు, ఉద్యమనాయకులు, స్టీల్ ప్లాంట్ నాయకులు, చిత్రంలో నటించిన నటి నటులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. అనంతరం హీరో సత్యారెడ్డి మీడియాతో మాట్లాడారు . విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదంతో ఉద్యమకారుల త్యాగాలు ప్రజలకు తెలియచేస్తూ 32 మంది ప్రాణ త్యాగాలు తో నిర్మిత మైన సినిమా ఉక్కు సత్యాగ్రహం అని తెలిపారు. ప్రజా యుద్ద నౌక , విప్లవ కవి గద్దర్ ఆఖరి చిత్రం అని చెప్పారు.. 32 మంది ప్రాణ త్యాగాలని ప్రపంచానికి తెలియచేస్తూ 37 రోజుల క్రితం 150 థియేటర్ ల్లో ఈ చిత్రం విడుదల అయ్యిందని ఇప్పటికి అనేక చోట్ల విజయవంతంగా ప్రదర్శంచబడుతుందని అంటే విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు అని నినాదం, తెలుగు ప్రజల సేంట్చె మెంట్ అని చెప్పారు. . సినియర్ నటుడు, విశాఖ జీవీఎంసీ బ్రాండ్ అంబాసిడర్ ఎన్టీఆర్ నటనా వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ప్రసన్నకుమార్ , నంది అవార్డు గ్రహీత వినయ ప్రకాష్ , ధనుశ్రీ తదితరాలు నటించారన్నారు. పక్క రాష్ట్రాల్లో కూడా ప్రవేటీకరణను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారని సినిమా విజయానికి అదే కారణం అన్నారు ప్రవేటీకరణను ఆపే ఏకైక సిద్ధాంతాన్ని సినిమా క్లయిమాక్స్ లో చూపించామని ప్రయివేటీకరణ ఆగిపోతుందన్నారు. ప్రయివేటీ కరణ ఆగకపోతే ప్రజలలోనికి వెళ్లి పాదయాత్ర చేస్తానని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రయివేటీకరణ ఆగే వరకు ప్రజల్లోనికి వెళ్లి పోరాటం కొనసాగుతుందన్నారు.స్టీల్ ప్లాంట్ ను ఎట్టి పరిస్థితుల్లో ప్రయివేటీకరణ కాన్వివం అన్నారు పార్టీలకు అతీతంగా ప్రజలు అందరూ కలిసి రావాలని సహాయసహకారాలు అందించాలని పిలుపు నిచ్చారు.

నటుడు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ… ప్రాణ త్యాగాలతో స్టీల్ ప్లాంట్ ను సాధించుకున్నామని ప్రైవేటీకరణ అడ్డుకుంటామని చెప్పారు. మంచి సందేశంతో సత్యారెడ్డి చిత్రాన్ని తీశారని అన్నారు నటులు మాదాల రంగారావు, ఆర్ నారాయణమూర్తి తరహాలో సత్యారెడ్డి నటించారన్నారు . వినయ ప్రకాష్ మాట్లాడుతూ సత్యారెడ్డి ఇప్పటివరకు 50 చిత్రాలను తీశారని ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ చిత్రాన్ని తీశారన్నారు . స్టీల్ ప్లాంట్ ఉద్యమం మీద తీసిన చిత్రం అన్నారు . మీడియా సమావేశంలో సీపీఎం నాయుకులు గంగారామ్, ఆర్ కె వి ఎస్ కుమార్, స్టీల్ ప్లాంట్ భూ నిర్వాసితుల సంఘం ప్రతినిధి నర్సింగ రావు, ఉమ్మడి అప్పారావు, కాంగ్రెస్ నాయుకులు వజ్జిపర్తి శ్రీనివాస్ , మజ్జి దేవిశ్రీ తదితరులు పాల్గొన్నారు