విజయ్ దళపతికి పోటీగా ఆ హీరోయిన్?

వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో(2026) కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతిపై తాను పోటీ చేస్తానని బీజేపీ నేత, హీరోయిన్ నమిత ప్రకటించారు. ‘రాజకీయాల్లో తెలివైన ప్రత్యర్థిపై పోటీ చేస్తే రాజకీయ ఎదుగుదల ఉంటుంది. అందుకే విజయ్పై పోటీ చేయాలని అనుకుంటున్నా. విజయ్ కూడా రాజకీయాల్లో రాణించాలి’ అని ఆమె పేర్కొన్నారు. కాగా విజయ్ మీద నమిత పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కవని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఈ ఇద్దరు కలిసి ఓ తమిళ చిత్రంలో నటించిన విషయం అందరికి తెలిసిందే.