Thapsi: ప్రముఖ హీరోయిన్ తాప్సీ.. రైతుల మరణాలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన హర్యానా మంత్రిని సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయింది. సోషల్ మీడియాలో ఏ మాత్రం వీలు దొరికినా, ఎవరు తప్పు చేస్తూ దొరికిన ఒకరిపై కామెంట్స్ చేసుకోవడం వంటివి జరుగుతుంది. అయితే తాజాగా Thapsi తాప్సీ హర్యానా మంత్రిపై కామెంట్స్ చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమాలు, నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎంతో మంది రైతులు ఆత్మబలిదానాలు చేసుకుంటున్నారు. ఇలా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుండగా.. దీనిపై స్పందించిన హర్యానా వ్యవసాయ శాఖా మంత్రి జేపీ దలాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొన్ని లక్షల మందిలో రెండు వందల మంది చనిపోరా.. ఇంట్లో ఉండి ఉంటే వాళ్లు చనిపోకుండా ఉంటారా? వాళ్లు తమ ఇష్టపూర్వకంగానే చనిపోయారు అంటూ దలాల్ అన్నాడు. దీంతో ఆ మంత్రిపై తీవ్రంగా రెచ్చిపోయింది తాప్సీ. మనిషి జీవితానికి విలువ లేకుండా పోయింది. ముఖ్యంగా మన ఆకలి తీరుస్తున్న రైతుల జీవితానికి విలువ లేదు.. ఒక మంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదు.. అన్నదాతలు మరణాలను అపహాస్యం చేస్తున్నారు అంటూ తన ట్విట్టర్లో తెలిపింది Thapsiతాప్సీ. అలాగే పలువురు బాలీవుడ్ ప్రముఖులు మంత్రిపై ఆగ్రహాం వ్యక్తంచేస్తున్నారు. దీంతో మంత్రి దలాల్ క్షమాపణలు చెప్పుకున్నాడు. తాను చేసిన వ్యాఖ్యలు చాలా తప్పు అని అర్థం చేసుకున్న.. క్షమాపణలు చెప్పాడు మంత్రి దలాల్.