Kajal: ఆ మెస్‌లో భోజ‌నం అద్భుతం.. నేను అక్క‌డినే తింటా: కాజ‌ల్ అగ‌ర్వాల్

Kajal: ప్ర‌ముఖ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్, గౌత‌మ్ కిచ్లు క‌లిసి తాజాగా పొల్లాచ్చిలోని ఓ మెస్‌లో భోజ‌నం చేశారు. మెస్ ఏంటీ వీరి స్థాయికి ఏదో పెద్ద హోట‌ల్‌లో, రెస్టారెంట్‌లో భోజ‌నం చేస్తారు. కానీ వీరిద్ద‌రు తాజాగా వాలంటైన్స్‌డే కానుక‌గా పొల్లాచ్చి వెళ్లారు. పొల్లాచ్చిలోని శాంతి మెస్‌కు వెళ్లి భోజ‌నం చేసి.. వారితో ఫోటోలు కూడా దిగారు. ఇక వీటికి సంబంధించిన ఫోటోలను త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేసింది Kajal కాజ‌ల్.. ఈ విష‌యం ఆమె తెలుపుతూ..

kajal aggerwal

నాకెంతో ఇష్ట‌మైన శాంతి మెస్ పొల్లాచ్చిలో ఉంది. ఆ మెస్ యాజ‌మానులైన శాంతిగారు, బాల‌కుమార్ గారు మాకు ఎంతో ప్రేమ‌గా భోజ‌నం వ‌డ్డించారు. దీంతో వారు ప్రేమ‌తో చేసే సర్వీస్ వ‌ల్లే శాంతి మెస్ 27సంవ‌త్స‌రాలుగా చాలా బాగా న‌డుస్తోంది. నాకు ఈ మెస్‌తో తొమ్మిదేళ్ల అనుబంధం ఉంది అంటూ ట్విట్ట‌ర్‌లో రాసుకొచ్చిందిKajal కాజ‌ల్‌. ఇక కాజ‌ల్ ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం ఆచార్య‌లో హీరోయిన్‌గా న‌టిస్తోందిKajal. అలాగే క‌మ‌ల్‌హాస‌న్ ఇండియ‌న్‌-2లో హీరోయిన్‌గా చేస్తోందిKajal.. ఈ సినిమాలో మ‌రో క‌థానాయిక‌గా ర‌కుల్‌ప్రీత్‌సింగ్ న‌టిస్తుంది. అదేవిధంగా కాజ‌ల్ న‌టించిన తొలి వెబ్‌సిరీస్ లైవ్ టెలికాస్ట్ ఇటీవ‌లే డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయింది. దీంట్లో Kajalకాజ‌ల్ సిగ‌రెట్ తాగుతూ క‌నిపించిన సీన్స్‌కు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తున్నాయి.