ఆగస్టు చివరి నుండి ‘గేమ్ చేంజర్’ అప్డేట్స్

ఈ రోజు మారుతి టీం ఆర్ట్స్ తరపున జామ్ జంక్షన్ అనే ఒక ఈవెంట్ కు సంబంధించి ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో దర్శకుడు మారుతి తో పాటు తెలుగు సినీ సంగీత దర్శకుడు తమన్, అలాగే కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కే ఎన్ పాల్గొన్నారు. ఆ ప్రెస్ మీట్ లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుండగా ఓ విలేకరి సంగీత దర్శకుడు తమన్ ను గేమ్ చేంజర్ అప్డేట్స్ గురించి అడగగా తమన్ ఇలా సమాధానం ఇచ్చారు. ఈమధ్య కాలంలోనే రాయన్ అనే సినిమాకు సంబంధించి జరిగిన ఓ ఈవెంట్లో నిర్మాత దిల్ రాజు గారు గేమ్ చేంజర్ సినిమాతో క్రిస్మస్ కు కలుద్దాం అని అన్నారు. అయితే సినిమా క్రిస్మస్ లో రానుంది కాబట్టి గేమ్ చేంజర్ సంబంధించి అప్డేట్స్ ఆగస్టు నెల చివరి నుండి ఉండబోతాయ్ అన్నట్లు తమన్ చెప్పారు. అలాగే ఈ సినిమాలో మొత్తం ఏడు పాటలు ఉన్నాయి. వాటిలో ఒక పాట ఇప్పటికే విడుదల అయింది. అయితే నెక్స్ట్ రాబోయే పాట ఏది అయ్యి ఉండొచ్చు అని విలేకరులు ప్రశ్నించగా ఆ విషయంపై ఇంకా నిర్ణయించుకోలేదని, మిగిలిన ఆరు పాటలలో ఏ పాటైనా కావచ్చును తమన్ తెలిపారు. ఇక శంకర్ దర్శకత్వంలో రాబోతున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ అప్డేట్ కోసం చరణ్ అభిమానులు ఆగస్టు నెల చివరి వరకు వేచి చూడాల్సిందే.