Kangana Ranaut: సినీ ప్రేక్ష‌కులారా.. వ‌చ్చేస్తోంది లేడీ ఫైర్ బ్రాండ్!

Kangana Ranaut: బాలీవుడ్ లేడీ ఫైర్ బ్రాండ్ కంగ‌నార‌నౌత్ అంటే ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.. కంగ‌నా, డైరెక్ట‌ర్ ఆర్‌జీవి వీరిద్ద‌రు ఒకే కుటుంబానికి చెందిన వ్య‌క్తులా.. వీరి ఆలోచ‌న‌లు, వివాదాలు సేమ్ టు సేమ్ ఉంటాయి.. ఆర్‌జీవి అంటే వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు.. అలాగే కంగ‌నా ర‌నౌత్ వివాదాల రాణిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంచితే.. ఆమె న‌టిస్తున్న తాజా చిత్రం త‌లైవి.. ఈ చిత్రం తమిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవితం ఆధారంగా తెర‌కెక్కుతుంది.

. ఇటీవ‌లే ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది.. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 23న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.. ఈ సంద‌ర్భంగా ఈ చిత్ర ట్రైల‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు చిత్ర‌బృందం. మార్చి 23న కంగ‌నార‌నౌత్ బ‌ర్త్‌డే నాడు సంద‌ర్భంగా త‌లైవి ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. చెన్నై, ముంబైల‌లో త‌లైవి ట్రైల‌ర్‌ను రిలీజ్ చేయ‌డానికి ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో Kangana Ranaut కంగ‌నా, అర‌వింద‌స్వామి, ప్ర‌కాశ్‌రాజ్ త‌దిత‌రులు న‌టించిన చిత్రానికి ఎ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్‌.సింగ్ ఈ చిత్రానికి నిర్మించారు.. జీవీ ప్రకాశ్ స్వ‌రాలు అందించారు.