Thala Ajith: అజిత్ స‌ర్‌లా ఏ హీరోను చూడ‌లేదు: హీరో కార్తికేయ

Thala Ajith: ఆర్ఎక్స్100 చిత్రంతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆకట్టుకున్నాడు యంగ్ హీరో కార్తికేయ‌. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఎంతో ఘ‌న విజ‌యం సాధించింది.. కార్తికేయ అటు హీరోగా మెప్పిస్తూ.. ఇటు విల‌న్‌గా కూడా న‌టించి త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకుంటున్నాడు. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం చావు క‌బురు చ‌ల్ల‌గాలో వైవిధ్య‌మైన పాత్ర చేసి వావ్ అనిపించుకున్నాడు కార్తికేయ‌. మార్చి 19న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది. ఇక తాలా అజిత్ న‌టిస్తున్న తాజా చిత్రం వ‌లిమైలో విల‌న్ గా అవ‌కాశం ద‌క్కించుకున్నాడు కార్తికేయ‌.

ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకోగా.. ఈ సినిమా గురించి కార్తికేయ తాజాగా స్పందించారు. Thala Ajith అజిత్ స‌ర్‌తో స్ర్కీన్ షేర్ చేసుకోవ‌డం ఎంతో ఆనందంగా ఉందని.. అలాంటి ప‌ర్స‌న్‌ను తాను ఇప్ప‌టివ‌ర‌కూ క‌ల‌వ‌లేద‌ని తెలిపారు. ఈ చిత్రంలోThala Ajith అజిత్ గారితో క‌లిసి ప‌నిచేయ‌డం వ‌ల్ల తాను ఎన్నో కొత్త విష‌యాలు నేర్చుకున్నాన‌ని అన్నారు. స్పెయిన్‌లో రేసింగ్ సీక్వెన్స్ సంబంధించి చిత్రీక‌ర‌ణ జ‌ర‌గాల్సి ఉంది.. దాదాపు మూడు రోజుల పాటు అక్క‌డ షూట్ జ‌ర‌గ‌వ‌చ్చ‌ని తెలిపారు. అంతే కాకుండా షూట్‌కు అనుమ‌తి కోరుతూ ఇప్ప‌టికే చిత్ర‌బృందం స్పెయిన్ ప్ర‌భుత్వానికి లేఖ రాసింద‌ని కార్తికేయ వివ‌రించారు.‌