రామ్ చరణ్ వదినకి అల్లు అర్జున్ ఛాన్స్…

తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలో పనికిరారు, గ్లామర్ గా కనిపించరు అనే మాటలని చెరిపేస్తూ ఈషా రెబ్బ లాంటి హీరోయిన్లు హాట్ ఫోటోషూట్స్ చేసి సత్తా చాటుతున్నారు. సరైన అవకాశం వస్తే స్కిన్ షో చేయడానికి, గ్లామర్ గా కనిపించడానికి ఆలోచిమనే హింట్ ఇస్తున్నారు. ఈ లిస్ట్ లో మరో తెలుగు అమ్మాయి పూజిత పొన్నాడ కూడా చేరింది. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ కి వదినగా, ఆది పినిశెట్టికి లవర్ గా కనిపించిన పూజిత పొన్నాడ మంచి గుర్తింపు తెచ్చుకుంది. మంచి కలర్, ఫిజిక్ మైంటైన్ చేసే పూజిత, ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఫొటోస్ పెడుతూ నెటిజెన్స్ ని ఖుషి చేస్తూ ఉంటుంది. తనలోని గ్లామర్ యాంగిల్ ని చూపిస్తున్నా కూడా స్టార్ స్టేటస్ తెచ్చే అవకాశం మాత్రం రాలేదు.

ఇంటర్నెట్ ని నమ్ముకోని టాలెంట్ షో చేస్తున్న పూజితతో సుకుమార్ మళ్లీ ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం. రంగస్థలం సినిమాలో ఛాన్స్ ఇచ్చిన సుకుమార్, ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న AA20లో పూజితకి ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. రీసెంట్ గా లాంచ్ అయిన ఈ మూవీలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. తిరుపతి శేషాచల అడవుల నేపథ్యం ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజిత పొన్నాడకు ఎలాంటి పాత్రని ఆఫర్ చేశారన్నది తెలియాల్సి ఉంది.