హాలీవుడ్ సినిమాలలో దూసుకుంటూ వెళ్తున్న తెలుగు అమ్మాయి

అవంతిక వందనపు అనే పేరు వినే ఉంటారు. ఇంకా సులువుగా ఈ అమ్మాయిని గుర్తుపట్టాలంటే ఫార్చ్యూన్ ఆయిల్ అడ్వర్టైజ్మెంట్ తో గుర్తుపట్టొచ్చు. మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం సినిమాతో మొదలై ఇప్పుడు హాలీవుడ్ స్థాయి నటిగా ఈమె ఎదగడం జరిగింది. బ్రహ్మోత్సవం సినిమాలోనే కాకుండా ప్రేమమ్, మనమంతా, రారండోయ్ వేడుక చూద్దాం, ఆక్సిజన్ తదితర తెలుగు సినిమాలలో నటించడం జరిగింది. అమెరికాలో పుట్టి పెరిగినప్పటికీ ఈమె తల్లిదండ్రులు తెలుగువారే. అయితే అవంతిక చిన్నప్పటినుండి పుట్టి పెరిగింది అమెరికాలోనే కాబట్టి తనకు అమెరికన్ సిటిజన్గా గుర్తించడం జరిగింది.

మీమ్ గర్ల్స్ అనే సినిమాతో తొలిసారి ప్రపంచవ్యాప్తంగా పరిచయమైన ఈ అమ్మాయి ఆ తర్వాత టారట్ అనే హాలీవుడ్ సినిమాతో మరోసారి అవంతిక ఆ సినిమాలో నటన అదరగొట్టింది అని చెప్పుకోవాలి. హార్రర్ థ్రిల్లర్ అయిన ఆ సినిమాలో అవంతిక కీలక పాత్ర పోషించడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్నఫ్లిక్ లో స్ట్రీమ్వి అవుతుంది. అవంతిక నటన విషయానికి వస్తె తనకి ఇచ్చిన పాత్రలో చొచ్చుకుపోతూ ప్రతి సీన్లోనూ సిట్యువేషన్ కి తగ్గట్లు భయానకమైన ఎస్ప్రేషన్స్ ఇస్తు ప్రతి ఒక్క సీన్ పండించింది. అలాగే కెమెరా టేకింగ్ కి తగ్గట్లు తన టేకింగ్ కూడా ఎక్కడ మిస్ కాకుండా జాగ్రత్త పడింది. తెలుగు అమ్మాయి అయినా అవంతిక వండనపు హాలీవుడ్ స్థాయి నటిగా ఎదగడం తెలుగు వారి అందరికీ గర్వకారణం.