తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెస్ నోట్

తేది 25-12-2023 సోమవారం రోజున సాయంత్రం 6 గంటలకు ప్రసాద్ ల్యాబ్ లో ఎఫ్ సి ఏ ఈసి మీటింగ్ నిర్వహించడం జరిగింది.
ఎఫ్ సి ఏ అధ్యక్షుడిగా ఉన్న సురేష్ కొండేటి అంశంపై చర్చ జరిగింది.
డిసెంబర్ 2న గోవా లో జరిగిన సంతోషం సౌత్ అవార్డ్స్ లో జరిగిన అసౌకర్య పరిస్తితి వల్ల ఇతర భాషా నటీనటుల ముందు తెలుగు సినిమా పరిశ్రమ పరువు పోయిందని ఫిలిం ఛాంబర్ భావించింది.
ఈ మేరకు ఎఫ్ సి ఎ అధ్యక్షుడు సురేష్ కొండేటి పై చర్యలు తీసుకోవాలని ఎఫ్ సి ఎ కు లేఖ రాశారు.

ఈ లేఖపై ఎఫ్ సి ఏ చర్చించి సురేష్ ను వివరణ కోరాం. దీనికి సురేష్ కొండేటి పది రోజులు సమయం అడిగారు. పదిరోజుల సమయం కూడా ఇచ్చాం. కానీ సురేష్ కొండేటి నుంచి ఎలాంటి సమాధానం కానీ, వివరణ కానీ రాలేదు.

ఈలోగా ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి నుంచి సురేష్ కొండేటిని తొలగించినట్లు ప్రసన్నకుమార్ ధ్రువీకరించారు.

25వ తేది వరకు కూడా సురేష్ కొండేటి నుంచి ఎలాంటి వివరణ రాకపోవడంతో, ఈ నేపథ్యంలో అన్ని కోణాల్లో చర్చించిన తర్వాత సురేష్ కొండేటి చర్యల వల్ల ఎఫ్ సి ఏ ప్రతిష్ట కు భంగం కలిగిస్తున్నాడని ఎఫ్ సి ఏ భావించింది. కాబట్టి సురేష్ కొండేటిని ఎఫ్ సి ఎ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ఈసి ఏకగ్రీవంగా తీర్మానించింది.

ఎం. లక్ష్మి నారాయణ
ప్రధాన కార్యదర్శి
ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్