తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ . తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ మరియు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జాయింట్ మీటింగ్ లో, కరోనా మహమ్మారి కారణంగా ఆగి పోయిన ఫిలిం షూటింగ్స్ తిరిగి ప్రారంభించుచున్న సందర్భంగా ఆ విషయములను చర్చించడానికి 16. 6. 2021 (బుధవారం) ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్ లోని మండలి కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది.
ఈ సమావేశంలో ఈ క్రింది విధంగా తీర్మానములు చేయడం జరిగినది
- ఈ కరోనా వైరస్ రావడం మూలాన గత ఏప్రిల్ నెల నుండి షూటింగ్స్ ఆగిపోయినవి. ఇప్పుడు తిరిగి షూటింగ్ ప్రారంభం అవుతున్నందున ఆర్తిస్ట్స్ లు గతంలో షూటింగ్ చేస్తూ ఆగిపోయిన చిత్రాలకు ప్రాముఖ్యత ఇస్తూ ఆ షూటింగ్స్ లో పాల్గొని 24 క్రాఫ్ట్స్ సంబంధించి ఎవరైనను ఆగిపోయి ఉన్న చిత్రాలను పూర్తి చేయవలసిందిగా నిర్ణయించ డమైనది. ఆ బ్యాలెన్సు వర్క్ పూర్తి అయిన తదుపరి మాత్రమే కొత్త సినిమాలు చేయుటకు నిర్ణయించడమైనది.
- దర్శకులు దానికి సంబంధించిన అన్ని విభాగాల వారు కరోనా వలన ఆగిపోయి ఉన్న చిత్రాలకు షెడ్యూల్స్ ని కుదించుకుని తక్కువ రోజులలో నిర్మాణం పూర్తి చేయవలసిందిగా నిర్ణయించ డమైనది. గత 2 1/2 నెలల నుండి షూటింగ్ కోసం అంగీకరించిన తేదీలకు అనుగుణంగా మరల సదరు సినిమా షూటింగ్స్ లకు తేదీలు కేటాయించి బ్యాలెన్స్ గా ఉన్న షూటింగ్ ను పూర్తి చేయాలనీ, ఆ తరువాత ఇతర సినిమా షూటింగులో పాల్గొనాలని నిర్ణయించడమైనది.
- షూటింగ్ చేసే షూటింగ్ చేసే ప్రొడక్షన్ హౌస్ వారు ఆర్టిస్ట్ ల నుండి టెక్నీషియన్ నుండి వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా డిక్లరేషన్ తీసుకోవాలని నిర్ణయించడం అయినది.
- షూటింగ్స్ కు హాజరై ప్రతి యూనియన్ సభ్యుడు ఒక డోస్ వ్యాక్సినేషన్ కచ్చితంగా తీసుకొని ఉండవలెనని అలా తీసుకొన్న సభ్యులు మాత్రమే షూటింగ్ కి హాజరయ్యే విధంగా ఉండాలని, ఆ ప్రకారంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వారికి ఒక లేఖ వ్రాయుటకు నిర్ణయించడమైనది. అలాగే ఫెడరేషన్ లోని 24 విభాగాల సభ్యులందరికీ ఇన్సూరెన్సు విదిగా చేయించాలని, ఆ బాధ్యతను ఫెడరేషన్ మరియు ఆయా యూనియన్ వారు తీసుకొనవలయును.
- ప్రభుత్వం వారు ఎప్పటికప్పుడు ఇస్తున్న మార్గదర్శకాలు (SOPs) విధిగా పాటించవలసిన దిగా నిర్ణయించడం అయినది. ఈ సూచనలు అన్నిటిని ప్రొడక్షన్ హౌస్ మేనేజర్స్, ఆర్టిస్ట్ మేనేజర్స్ కి తెలియ చేస్తూ వారు ఆయా టెక్నీషియన్ కు ఆయా ఆర్టిస్ట్ లకు తెలియ చేయవలసిన బాధ్యత వారిదే అని తీర్మానించడమైనది.
- అలాగే ప్రతి ఒక్క టెక్నీషియన్, ఆర్టిస్ట్ వ్యక్తిగతంగాను, వ్యవస్థ పరంగానూ అందరు సామాజిక బాధ్యత తో మెలుగుతూ మరియు
తగు జాగ్రత్తలు తీసుకొంటూ షూటింగ్స్ లలో పాల్గొనాలని కోరడమైనది - అలాగే ఫిలిం ఇండస్ట్రీ లోని ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ ఖచ్చితంగా తీసుకోవాలని సూచించడం అయినది
- పైన తెలియజేసిన తీర్మానాలను తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ వారు తమ సమ్మతిని తెలియచేసినారు.
- ఈ విషయాలకు సంబంధించి సలహాలు గాని, ఫిర్యాదులు గాని, ఏమైనా ఉన్న యెడల లేదా వీటిని పాటించని యెడల తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారికి వెంటనే తెలియ జేసిన యెడల, ఆ ప్రకారం వారు తగు చర్యలను తీసుకొని వాటిని అమలు చేయుటకు నిర్ణయించడం అయినది అధ్యక్షులు
(నారాయణ దాస్ కిషన్ దాస్ నారంగి) గౌరవ కార్యదర్శులు
(కె.ఎల్.దామోదర్ ప్రసాద్) (ఎం రమేష్)