తెలుగు సినిమా పుట్టినరోజున అవార్డులు

తెలుగు ఫిలిం చాంబర్లో నేడు ఒక కీలక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో నటులు మురళీమోహన్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ భరత భూషణ్, సెక్రటరీ ప్రసన్నకుమార్, దర్శకుడు వీరశంకర్, జర్నలిస్ట్ జయదేవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా తెలుగు సినిమా పుట్టినరోజున అవార్డులు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 6వ తేదీన తెలుగు సినిమా పుట్టినరోజు సందర్భంగా ఇకపై ప్రతి సంవత్సరం ప్రభుత్వ అవార్డులతో పాటు ఫిలిమ్ చాంబర్ నుండి కూడా అవార్డు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అంతేకాక తెలుగు సినిమా పుట్టినరోజు ప్రతి నటీనటులు వాడి ఇళ్లపై జెండా ఎగరేయాలని, అలాగే ప్రతి సినిమా థియేటర్ పైన జెండా ఎగరవేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ జెండాకు సంబంధించి జెండా రూపకల్పన ఫిలిం ఛాంబర్ పరుచూరి గోపాలకృష్ణ గారికి అప్పగించడం జరిగింది.