.సింగర్ మను, కల్పన, గోరేటి వెంకన్న కలసి అద్భుతంగా ఆలపించిన ఈ పాట అందరిలో ఉత్తేజాన్ని కలిగిస్తోంది. పాట ఆవిష్కరణ సందర్భంగా సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, యాంకర్ జోర్ధార్ సుజాత, సింగర్ విహ,గీత రచయిత సంజయ్ మహేష్ లు , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. ఈ పాట గురించి రాకింగ్ రాకేష్ ను కెసిఆర్ గారు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ దీవకొండ దామొదర్ రావు, ప్రణాలిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్,ఎమ్మెల్సీ,మాజీ స్పీకర్ మధుసుధన చారి ,ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్,బీఆర్ఎస్ నాయకులు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు.