Tollywood: తేజా స‌జ్జా- ప్రియా ప్ర‌కాశ్ ‘ఇష్క్’ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌..

Tollywood: టాలీవుడ్‌లో చిన్న‌ప్ప‌టి నుంచి సినిమా వాతావ‌ర‌ణంలో పెరిగి ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎదిగి గుర్తింపు సంపాదించుకున్నాడు తేజా స‌జ్జా. మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌కళ్యాన్‌, సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు స్టార్ల చిన్న‌ప్ప‌టి పాత్ర‌ల్లో న‌టించి ప్రేక్ష‌కుల మెప్పు పొందాడు. ఇక తేజా స‌జ్జా హీరోగా న‌టించిన జాంబీరెడ్డి చిత్రం ఇటీవ‌లే విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యం ద‌క్కించుకుంది.. దీంతో Tollywood టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు.. అలాగే ప్రేక్ష‌కుల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. అనంత‌రం ఆయ‌న ఇష్క్‌(నాట్ ఏ ల‌వ్‌స్టోరీ అనేది క్యాప్ష‌న్‌) చిత్రంలో న‌టిస్తున్నాడు.

Ishq First Look

ఇందులో తేజా సజ్జాకు జోడీగా వింక్ గాళ్ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌.రాజు ద‌ర్శ‌క‌త్వంలో, Tollywood ప్ర‌ముఖ నిర్మాత ఆర్‌బీ చౌద‌రి స‌మ‌ర్ప‌ణ‌లో సూప‌ర్ గుడ్ ఫిలింస్ బ్యాన‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. ఈ పోస్ట‌ర్‌లో తేజా స‌జ్జా వెనుక నుంచి కోపంతో ప్రియా ప్ర‌కాశ్‌ను చూస్తుంటాడు.. అలాగే ప్రియా ప్రకాశ్ న‌వ్వుతూ క‌నిపిస్తుంది. ఈ పోస్ట‌ర్‌పై తేజా త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా.. ల‌వ్ స్టోరీస్ సినిమాలు చూసి బోర్ అవుతున్నారా అంటూ తెలిపాడు. ఇక ఈTollywood చిత్రానికి మెహ‌తి స్వ‌ర‌సాగ‌ర్ స్వ‌రాలు అందిస్తుండ‌గా.. ఈ చిత్రానికి సంబంధించి మిగ‌తా విష‌యాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌నిTollywood చిత్ర‌బృందం తెలిపారు.