Tollywood: ‘గాలి సంపత్’ రెండో సాంగ్‌ను రిలీజ్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

Tollywood: శ్రీవిష్ణు, న‌ట‌కీరీటీ రాజేంద్ర‌ప్ర‌సాద్ ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో గాలి సంప‌త్ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి స్టార్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో.. అనీష్ కృష్ణ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. షైన్ స్క్రీన్స్‌, ఇమేజ్ స్పార్క్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది, ఎస్‌. క్రిష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి పోస్ట‌ర్‌, ట్రైల‌ర్‌, ఫిఫీఫీ సాంగ్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో అల‌రించాయి. తాజాగా Tollywood ఈ సినిమా నుంచి రెండో సాంగ్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం.. ఈ మేర‌కు టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ సాంగ్‌ను రిలీజ్ చేశారు.

Sri vishnu

పాప ఓ పాప‌.. నీ పేరు త‌ల‌చి నేను మ‌జునున‌య్యానే.. పాప ఓ పాప నా పేరు మ‌రిచి నేను పిచ్చోన్న‌య్యానే అంటూ సాగే పాట‌కు రామ‌జోగ‌య్య శాస్త్రి లిరిక్స్ అందించ‌గా.. బెన్నీ దాయ‌ల్, బెన్ హ్యూమ‌న్‌, అనుదీప్ దేవ్ ఈ సాంగ్‌ను ఆల‌పించారు. ఈTollywood చిత్రానికి అచ్చు రాజ‌మ‌ణి స్వ‌రాలు అందించ‌గా.. ప్ర‌స్తుతం ఈ తాజా సాంగ్ ఎంతో అల‌రిస్తోంది. ఇక ఇందులో శ్రీ విష్ణుకు జోడీగా ల‌వ్ లీ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇక ఈ చిత్రానికి అనిల్ రావిపూడి డైలాగ్స్ కూడా అందించ‌గా.. మ‌హా శివ‌రాత్రి కాన‌కగా.. Tollywoodమార్చి 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.