కన్నడలో వచ్చిన ‘హడినెలెంటు’కి డబ్బింగ్ వర్షన్‌గా ‘టీనేజర్స్ 17/18’ అనే చిత్రం తెలుగు ఆడియెన్స్‌కి ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది. యథార్థ సంఘటనల ఆధారంగా టీనేజర్స్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ చిత్రం ఉంంటుంది. యూత్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను ఇందులో చూపించారు. ఈ చిత్రానికి అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు వచ్చాయి. ఇక ఓటీటీ ఆడియెన్స్‌ను పలకరించేందుకు ఈ చిత్రం వచ్చేసింది. సెప్టెంబర్ 21 నుంచి ఈ సినిమా ఆహాలోకి వచ్చేసింది. హనుమాన్ మీడియా మీద నిర్మాత బాలు చరణ్ ఈ మూవీని ఆహాలోకి తీసుకొచ్చారు.
మెల్ బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్, ఒట్టావా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇలా అనేక జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో టీనేజర్స్ చిత్రం అందరినీ ఆకట్టుకుని అవార్డులను సాధించింది. పృథ్వీ కొననూర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మించారు. ఇక ఈ చిత్రంలో షెర్లిన్ బోస్లే, నీరజ్ మాథ్యూ, రేఖా కుడ్లిగి, సుధా బెలావుడి, భవానీ ప్రకాష్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.
ఇక ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చింది. అర్దరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతున్నా.. ఇప్పటికే మిలియన్ల మినిట్ వ్యూస్‌తో ఈ చిత్రం దూసుకుపోతోంది. ఇప్పటికే ఆహాలో ఈ సినిమా టాప్ 4 లోకి వచ్చేసింది. 12 గంటల్లో 15 మిలియన్ మినిట్ వ్యూస్‌తో ఆహాలో ట్రెండ్ అవుతోంది.