తమిళ హీరో విజయ్ మహానాడు సభ

తమిళ్ హీరో విజయ్ దళపతి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. టీవీకే పార్టీతో విజయ్ ఈ ఎన్నికలలో పోటీకి దిగిపోతున్నారు. ఈ సందర్భంగా తన రాజకీయ పార్టీ అయిన టీవీకే పార్టీ నుండి తొలి మహానాడు సభ నిర్వహించనున్నారు. ఇదే తొలి మహానాడు సభ కావడంతో విల్లిపురంలోని విక్రవాండిలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభ ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కావడంతో ఇప్పటికే సుమారు 3 కిలోమీటర్ల మేర తిరుచి రహదారిపై జెండాలు అలాగే విద్యుత్తు దీపాలంకరణ చేయడం జరిగింది. ఈ రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో హీరో విజయ్ దళపతి దిగుతున్నట్లు తెలుస్తుంది.