మెగాస్టార్ చిరంజీవి హీరోగా చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్న భారీ బడ్జట్ చిత్రం సైరా. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రొమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర యూనిట్, సైరా గురించి ఎన్నో విశేషాలని బయట పెడుతున్నారు. రోజురోజుకి అంచనాలు పెంచుతున్న సైరా నుంచి బయటకి వచ్చిన లేటెస్ట్ అప్డేట్, పాటల గురించి. సైరా సినిమాలో మూడు పాటలు మాత్రమే ఉంటాయని, అందులో ఒకటి బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే సాంగ్ కాగా మరొకటి ఉయ్యాలవాడ ఎంట్రీ సాంగ్ అని మూడో పాట జాతర పాటని సమాచారం. చిత్రంలోని లీడ్ కాస్ట్ అందరితో పాటు ప్రజల మధ్య చిత్రీకరించిన జాతర పాట సినిమాకే హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది.
సైరాలో మూడు పాటలు మాత్రమే ఉంటాయనే విషయం తెలిసిన మెగాఫ్యాన్స్ మాత్రం ఒకింత డిజప్పాయింట్ అవుతున్నారు. చిరు సినిమాలో మూడు పాటలే ఉండడమేంటని అనుకుంటున్నారు కానీ ఆరు పాటలు, నాలుగు ఫైట్లు ఉండడానికి సైరా ఏమైనా రెగ్యులర్ కమర్షియల్ సినిమానా? అదో చరిత్ర. జనం మరిచిన చరిత్ర, చిరు 11 ఏళ్లుగా చెప్పాలనుకునే చరిత్ర అందుకే కథపైన మాత్రమే ద్రుష్టి పెట్టి ఎలాంటి హంగుల జోలికి వెళ్లకుండా చిత్ర యూనిట్ చాలా నిజాయతీగా కేవలం ఉయ్యాలవాడ కథని చెప్పడానికి మాత్రమే ప్రయత్నిస్తోంది. పాటలు లేకపోయినా పోరాటాలు ఉంటాయి… తెల్లదొరలపై మొదటిసారి మన తెలుగు వాడు చేసిన అద్భుతమైన పోరాటాలు ఉంటాయి, ఆ తర్వాత దేశం కోసం పోరాడాలి అనుకునే ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన అతని కథ ఉంటుంది. అక్టోబర్ 2న థియేటర్ కి వెళ్లి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీర చరిత్రని, మనం మరిచిన మన వీరుడి చరితని చూసి గర్వపడండి.