ప్రేక్షకులను సీట్ ఎడ్జిలో కూర్చోపెట్టెల ఉన్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ “Case No 15” ట్రైలర్ విడుదల

అజయ్, రవి ప్రకాష్, హర్షిణి, మాండవియా సెజల్ నటీ నటులుగా తడకల వంకర్ రాజేష్ స్వీయ దర్శకత్వంలో బి.జి. వెంచర్స్ పతాకంపై వస్తున్న సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ “Case No 15”. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైన చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయగా అతిధులుగా వచ్చిన ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ వచ్చారు. ఆయన చిత్ర ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది. టి. యఫ్. సి. సి. ప్రెసిడెంట్ ప్రతాని రామకృష్ణ గౌడ్ చిత్ర టీజర్ ను విడుదల చేశారు. అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ లిరికల్ వీడియోను విడుదల చేశారు.

అనంతరం గెస్ట్ గా వచ్చిన నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. రాజేష్ తన మొదటి సినిమా నుండి నాతో డిస్కస్ చేసేవాడు. ఎదో ఒక సినిమా తీసి చుట్టేదాంలే అనుకోకుండా మంచి క్వాలిటీ సినిమా తియ్యాలని తపన పడతాడు.బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మంచి ఆర్టిస్టులతో, మంచి టెక్నిషియన్స్ తో తీసిన ఈ సినిమాలో మ్యూజిక్, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వంటి మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా రాజేష్ కు బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

టి..యఫ్.సి.సి. ప్రెసిడెంట్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. మంచి ప్యాడింగ్ తో తీసిన ఈ సినిమాలో నటీనటులు అందరూ చాలా కసిగా నటించారు. మంచి క్వాలిటీతో తీసిన రాజేష్ కు ఈ సినిమా మంచి పేరుతో పాటు మంచి విజయాన్ని కూడా అందుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు.

ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ…దర్శక, నిర్మాత అయిన రాజేష్ నిరంతర యోధుడులా హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు నిర్మిస్తాడు.. మంచి ఆర్టిస్టులతో పాటు మంచి టెక్నిషియన్స్ తో తీసిన ఈ “Case No 15” సినిమా టీజర్, ట్రైలర్, లిరిక్స్ చాలా బాగున్నాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా రాజేష్ కు మంచి పేరును తీసుకురావాలని అన్నారు.

చిత్రం శ్రీను మాట్లాడుతూ …రాజేష్ గారు తీసే ప్రతి సినిమాలో నాకు తప్పకుండా ఒక రోల్ ఇస్తారు. ఇందులో కూడా నాకు మంచి పాత్ర ఇచ్చారు. ఈ సినిమా తనకు మంచి పేరుతో పాటు డబ్బు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నటుడు రవి ప్రకాష్ మాట్లాడుతూ.. పోలీస్ క్యారెక్టర్స్ కాకుండా డిఫరెంట్ రోల్స్ లో నటిద్దాం అనుకున్న నాకు రాజేష్ గారు చెప్పిన ‘Case no 15’ నాకు చాలా ఇంట్రెస్ట్ ను కలిగించింది. ఈ రోజు ఈ సినిమా చాలా బాగా వచ్చింది అంటే డానికి కారణం రాజేష్ గారే..అయన మంచి తనానికి ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని అన్నారు.

హీరోయిన్ మాండవియా సెజల్ మాట్లాడుతూ.. ఇలాంటి మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాత రాజేష్ గారికి నా ధన్యవాదాలు అన్నారు.

చిత్ర దర్శక,నిర్మాత తడకల వంకర్ రాజేష్ మాట్లాడుతూ.. మా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు..ఈ సినిమాకు జాన్ మంచి మ్యూజిక్ ఇవ్వగా, ఆనం వెంకట్ గారు అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఇచ్చారు. ఇందులో నటించిన నటీ,నటులు, టెక్నిషియన్స్ అందరూ సహకరించడంతో సినిమా చాలా బాగా వచ్చింది. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ గా సాగే ఈ సినిమాలో ప్రతి సీన్ చూసే ప్రేక్షకులను ఉత్కంఠ కు గురి చేస్తుంది అని అనుకుంటున్నాము. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని అన్నారు.

నటీ నటులు
అజయ్, రవి ప్రకాష్, హర్షిణి, మాండవియా సెజల్, చమక్ చంద్ర . చిత్రం శ్రీను, అప్పారావు, గడ్డం నవీన్, కె. ఏ పాల్ ఫేమ్ రాము, జూనియర్ రాజశేఖర్, పవిత్ర, కవిత, రేఖ
తదితరులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్ : బి.జి. వెంచర్స్
నిర్మాత మరియు దర్శకుడు – తడకల వంకర్ రాజేష్
సినిమాటోగ్రాఫర్ – ఆనం వెంకట్
సంగీతం : జాన్
ఎడిటర్ : ఆర్.కె.స్వామి
లిరిక్ రైటర్- బాలకృష్ణ,
కళ- మధురబ్బ
కలరిస్ట్ : రత్నాకర్ రెడ్డి
పి. ఆర్ ఓ : ముత్యాల సత్యనారాయణ