సుశాంత్ సూసైడ్ కేసు: రియా దగ్గర అంత డబ్బు ఎక్కడిది?

Rhea Chakraborty

సుశాంత్ సూసైడ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అతనిది సూసైడ్ కాదని కచ్చితంగా మర్డర్ చేసి ఉండవచ్చని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిపై కూడా అనుమానం వ్యక్తం చేస్తూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ బీహార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం హాట్ టాపిక్ గా మారింది..

ఇప్పటికే ముంబై పోలీసుల విచారణతో సతమతమవుతున్న రియాను మరోవైపు బిహార్ పోలీసులు కూడా అనేక విషయాలపై విచారించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ కేసు విషయంలో రియా ఇండియన్ టాప్ మోస్ట్ క్రిమినల్ లాయర్ ని సెలెక్ట్ చేసుకుంది. గతంలో ఆ లాయర్ సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ వంటి వారి కేసులను కూడా వాధించాడు. అతని డైలీ ఫీజు 10లక్షలు అని తెలుస్తోంది. ఇక రియా సినిమాల నుంచి పెద్దగా సంపాదించింది లేదు. అలాంటిది లాయర్ కి ఆ రేంజ్ లో డబ్బులు ఎలా ఇస్తోంది? అసలు ఆమె దగ్గర అంత డబ్బు ఎక్కడిది అనే విషయంలో అనుమానాలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం రియా బ్యాంక్ ఎకౌంట్స్ ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.