రజనీకాంత్ సినిమా విడుదల తేది ప్రకటన

రజనీకాంత్ ముఖ్య పాత్రలో నటిస్తూ అమితాబచ్చన్, ఫహాడ్ ఫాసిల్, అభిరామి, దగ్గుబాటి రానా తదితరులు కీలక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా వెట్టియన్. టి జె జ్ఞానవేలు రచన దర్శకత్వంలో జికెఏం తమిళ్ కుమారన్, ఎ సుబస్కారన్ నిర్మాతలుగా ఈ చిత్రం రాబోతుంది. ఎస్ ఆర్ కథిర్ ఈ సినిమాకు డిఓపిగా పని చేయగా ఇమ్మన్, అనిరుధ్, జోసెఫ్ విజయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నట్లు సినిమా టీం వెల్లడించడం జరిగింది. దీనితో సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.