ప్రముఖ బిజినెస్మెన్ రామ్ వీరపనేనితో రెండో పెళ్లికి ఇటీవల టాలీవుడ్ సింగర్ సునీత రెడీ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా పూర్తవ్వగా.. త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 26న సునీత-రామ్ పెళ్లి జరపాలని పెద్దలు నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ముందుగా జనవరిలో పెళ్లి చేసుకోవాలని సునీత, రామ్ అనుకున్నారు. కానీ జనవరి నుంచి నాలుగు నెలల పాటు మంచి పెళ్లి ముహూర్తాలు లేకపోవడంతో.. ఈ నెలలోనే చేసుకోవాలని ఫిక్స్ అయినట్లు వార్తలొస్తున్నాయి.
వీరి పెళ్లి వాయిదా పడిందని, ఫిబ్రవరిలో ఉంటుందని ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. తాజాగా వచ్చిన వార్తలను బట్టి చూస్తే.. అవి అవాస్తవమే అని తెలుస్తోంది. ఈ నెల 26న ఒక ప్రైవేట్ హోటల్లో వీరి పెళ్లి జరగనుందని టాక్. కరోనా క్రమంలో ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారని తెలుస్తోంది.
రామ్ వీరపనేని మ్యాంగో మీడియా పేరుతో ఒక కంపెనీ నడుపుతున్నారు. ఆయనకు కూడా ఇది రెండో పెళ్లి అని తెలుస్తోంది. ఇక సునీతకు 19 ఏళ్ల వయస్సులోనే పెళ్లి కాగా.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లి అయిన కొద్ది సంవత్సరాలకే భర్తతో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంది. చాలా సంవత్సరాలుగా కుటుంబంతో కలిసి ఉంటున్న సునీత… ఇప్పుడు పిల్లల భవిష్యత్ కోసం రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.