ఎట్టకేలకు సుమన్ నోరు విప్పారు! అప్పట్లో తనను బ్లూ ఫిలిమ్స్ కేసు లో ఇరికించింది తన మిత్రుడు దివాకర్ అని తెలిపారు.అదొక ఫామిలీ ఎఫైర్ వ్యవహారం గాలి వాన లా మారిందని చెప్పారు.
ఈ వివాదంలోకి సినిమా వాళ్లను అనవసరంగా లాగారు.నేను జైలుకు వెళ్తానన్న విషయం నాకు ముందే తెలుసు. అందుకే నా స్నేహితుడు భాను చందర్‌ను కాపాడేందుకు ప్రయxత్నించాను. ‘నన్ను కలవద్దు, నాకు ఫోన్ చెయ్యొద్దు’ అని భాను చందర్‌తో కావాలనే చెప్పాను.నేను తెలుగులో బాగా క్లిక్ అవుతాను అని నమ్మిన వ్యక్తి భానునే..! నా వల్ల అతను ఇబ్బందులు పడకూడాదనే ఉద్దేశంతో అలా చెప్పాను.నేను ఇరుక్కున్నా.. నా వల్ల మిగిలిన వారికి ఇబ్బంది తలెత్తకూడదని ఆ టైములో అనిపించింది. ఆ రోజు జరిగిన దానికి పూర్తి కారణం అప్పటి నా మిత్రుడు దివాకరే. అతని గురించి నేను ఎప్పుడో చెప్పాను. కానీ అనవసరంగా కొంతమంది హీరోల పేర్లు తెర మీదకు వచ్చాయి. ఆ రోజు జరిగినదానికి.. ఏ హీరోతోనూ సంబంధం లేదు” అంటూ చెప్పుకొచ్చాడు సుమన్.