Sulthan: కార్తీ “సుల్తాన్” హ‌క్కుల‌ను సంపాదించుకున్న వ‌రంగ‌ల్ శ్రీ‌ను..

Sulthan: కోలీవుడ్ స్టార్ కార్తీ న‌టించిన తాజా చిత్రం సుల్తాన్‌. ఈ చిత్రానికి బ‌క్కియ‌రాజ్ క‌న్న‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్ ఆర్ ప్ర‌కాశ్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కార్తీ స‌ర‌స‌న ర‌ష్మీక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ Sulthanచిత్రం ద్వారా ర‌ష్మిక త‌మిళ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మవుతుంది. ఇక కార్తీకి త‌మిళ్‌తో పాటు తెలుగులో కూడా ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. అందువ‌ల్ల ఈ సినిమాను త‌మిళ్‌తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయ‌నున్నారు.

Sulthan Movie

Sulthan కాగా ఈ చిత్ర తెలుగు హ‌క్కుల‌ను డిస్ట్రీబ్యూట‌ర్ వ‌రంగ‌ల్ శ్రీ‌ను సొంతం చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయ‌నే రిలీజ్ చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి పోస్ట‌ర్ల్‌, ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకుంది. దీంతో త‌మిళ్ ప్రేక్ష‌కుల‌తో పాటు తెలుగు ప్రేక్ష‌కులు కూడా ఈSulthan చిత్రం కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న పొన్నియ‌న్ సెల్వ‌న్‌లో కార్తీ ఓ కీల‌క‌పాత్ర‌ను చేస్తున్నాడు. ఈ చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.