సుకుమార్ తో విజయ్ దేవరకొండ మూవీ.. వచ్చేది ఎప్పుడంటే?

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో వర్క్ చేయాలని చాలా మంది అగ్ర దర్శకులు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. అయితే విజయ్ మాత్రం కేవలం తనకు సెట్టయ్యే కథలను మాత్రమే సెలెక్ట్ చెలుకుంటున్నాడు. ఇక ఈ రోజు విజయ్ అభిమానులకు కిక్కిచ్చే అప్డేట్ ఇచ్చాడు. విలక్షణ దర్శకుడు సుకుమార్ తో సినిమా చేయబోతున్నట్లు అఫీషియల్ గా ఒక పోస్టర్ కూడా విడుదల చేశాడు.

సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా తరువాత ఎవరితో వర్క్ చేయబోతున్నారు అనే విషయంపై కూడా ఫైనల్ క్లారిటీ ఇచ్చేశారు. నాలోని నటుడు సూపర్ ఎక్సైట్ అయ్యాడు.
నాలోని ప్రేక్షకులు సంబరాలు చేసుకుంటున్నారు!. మేము మీకు ఒక గుర్తిండిపోయే సినిమాను ఇవ్వగలమని హామీ ఇస్తున్నాము. సుక్కు సార్ తో సెట్‌లో కలిసి పని చేయాలని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను.. అంటూ సినిమాను నిర్మించబోతున్న కేదార్ సెలగాం శెట్టికి విజయ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా 2022లో ప్రేక్షకుల ముందుకు రానుంది.