పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము

జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో ఏప్రిల్ 22, 2025న జరిగిన భీకరమైన ఉగ్రదాడిని తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరపున తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి తీవ్రంగా ఖండిస్తోంది. ఈ దాడిలో 26 మంది అమాయక పర్యాటకులు, వారిలో ఇద్దరు విదేశీయులు, ఒక నావీ అధికారి మరియు ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి సహా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కిరాతక దాడి మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన హేయమైన చర్యగా మేము భావిస్తున్నాము.

ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాము. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాము. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సమాజానికి ఒక శాపంగా పరిగణించబడాలి, మరియు దానిని సమూలంగా అంతం చేయడానికి అందరూ ఐక్యంగా పనిచేయాలి.

తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎప్పుడు కూడా శాంతి, సామరస్యం, మరియు మానవతా విలువలను కాపాడటానికి కట్టుబడి ఉంటుంది. ఈ దాడి వెనుక ఉన్న దోషులను న్యాయం ముందు తీసుకురావాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మరియు భవిష్యత్తులో ఇటువంటి దాడులను నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలను అధికారులు తీసుకోవాలని కోరుతున్నాము.