పొన్నియన్ సెల్వన్ లో స్టార్ హీరోయిన్…

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఐకానిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మణిరత్నం. గత కొంత కాలంగా సరైన సినిమా పడక ఇబ్బంది పడుతున్న మణిరత్నం, తనలోని క్రియేటివిటీ అంతా వాడి నవాబ్ సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఈ మూవీ తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న మణిరత్నం, ప్రస్తుతం తన డ్రీం ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. భారీ బడ్జట్ తో అంతకు మించిన భారీ స్టార్ కాస్ట్ తో రానున్న పొన్నియన్ సెల్వన్ సినిమాలో అన్ని ఇండస్ట్రీల స్టార్స్ నటించబోతున్నారు.

అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య, విక్రమ్, కీర్తి సురేష్ లాంటి నటులు ఆన్ బోర్డ్ రావడంతో పొన్నియన్ సెల్వన్ కాన్వాస్ బాగా పెరిగిపోయింది. హిస్టారికల్ వార్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ లో స్టార్ హీరోయిన్ త్రిష ఒక కీ రోల్ ప్లే చేయడానికి ఓకే చెప్పిందని సమాచారం. ఈ విషయంపై అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా త్వరలో బయటకి రానుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న పొన్నియన్ సెల్వన్ సినిమాని మద్రాస్ టాకీస్ అండ్ లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా ఆడియన్స్ టార్గెట్ గా రూపొందనున్న ఈ సినిమా డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.