కరోనా నుంచి బయటపడాలంటే రెండే రెండు ఆయుధాలు: రాజమౌళి

ss rajamouli

దర్శకధీరుడు రాజమౌళి అలాగే వారి కుటుంబ సభ్యులలో కొందరు ఇటీవల కరోనా వైరస్ భారిన పడిన విషయం తెలిసిందే. అయితే వారు త్వరగానే వైరస్ నుంచి బయటపడ్డారు. కోలుకున్న తరువాత మొదటిసారి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి తాను తీసుకున్న జాగ్రత్తల గురించి క్లియర్ గా వివరణ ఇచ్చారు.

రెండు విషయాలను రెగ్యులర్ గా ఫాలో అయితే కరోనా నుంచి బయటపడవచ్చని నేను రెండు ఆయుధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చానని అన్నారు. ఒకటి మన శ్వాస కరెక్ట్ గా ఉండేలా డైలీ బ్రీతింగ్ వ్యాయామం అవసరం. అలాగే ఆవిరి కూడా పట్టుకోవాలి. ఈ రెండు విషయాలను కరెక్ట్ గా ఫాలో అయితే కరోనా నుంచి కొలుకోవచ్చని అన్నారు. ఇక RRR షూటింగ్ కరోనా అదుపులోకి వచ్చిన తరువాతే స్టార్ట్ అవుతుందని డిసెంబర్ వరకు వైరస్ తీవ్రత తగ్గే అవకాశం కనిపించడం లేదని అన్నారు. ఒకవేళ షూటింగ్ స్టార్ట్ అయితే సినిమా రిలీజ్ కి ఆరు నెలల సమయమే పట్టవచ్చని కూడా అన్నారు. అయితే షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంలో ఏ మాత్రం క్లారిటీ లేదని అన్నారు.