తారక్ కోసం రాజమౌళి రివర్స్ ప్లాన్

ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఫిజిక్ తో సాలిడ్ ఫిట్ గా ఉన్న హీరో కానీ ఒకప్పుడు మాత్రం ఎన్టీఆర్ చాలా బొద్దుగా ఉండే వాడు. అదే తారక్ తో రెండు హిట్స్ ఇచ్చిన రాజమౌళి, యమదొంగ సమయానికి ఎన్టీఆర్ యంగ్ యముడిగా చూపించడానికి 20 కేజీల బరువు తగ్గించాడు. యమదొంగ సినిమా చూసిన వాళ్లు తారక్ మేకోవర్ ని రీఎంట్రీగా ఫీల్ అయ్యారంటే, జక్కన ఇచ్చిన ఇంపాక్ట్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఈ మూవీ తర్వాత దాదాపు పుష్కర కాలం పాటు తన ఫిజిక్ పై ప్రయోగాలు చేస్తూ అభిమానులకి ఎప్పటికప్పుడు కొత్త తారక్ ని పరిచయం చేస్తూనే ఉన్నాడు.

అలా సినిమా సినిమాకి తన లుక్ మారుస్తూ వచ్చిన ఎన్టీఆర్, పన్నెండేళ్ల తర్వాత మళ్లీ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు. తారక్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించే జక్కన, ఈసారి కూడా అతన్ని కొత్తగా చూపించాలనే ప్రయత్నంలో 20 కేజీల బరువు పెరగమని చెప్పాడట. రాజమౌళిపైన నమ్మకంతో తారక్ ట్రిపుల్ ఆర్ కోసం వైట్ గైన్ అయ్యాడు. అయితే గతంలో లాగా బొద్దుగా కాకుండా ఎన్టీఆర్ ఈసారి సాలిడ్ గా రెడీ అయ్యి, ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో కొత్త ఎన్టీఆర్ ని చూపించబోతున్నాడని తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ కోసం జక్కన వేసిన ఈ రివర్స్ ప్లాన్ ఇంపాక్ట్ ఏ రేంజులో ఉంటుందో తెలియాలి అంటే అక్టోబర్ 22 వరకూ ఆగాల్సిందే, ఎందుకంటే కొమరం భీమ్ జయంతి సంధర్భంగా ఆర్ ఆర్ ఆర్ నుంచి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వచ్చేది ఆ రోజే.