శ్రీమంతుడు మూవీ డైరెక్టర్ కొరటాల శివకు సుప్రీంకోర్టులో చిక్కు?

శ్రీమంతుడు సినిమా కథను… స్వాతి పత్రికలో ప్రచురించిన కథను కాపీ చేశారని హైదరాబాద్‌ నాంపల్లి కోర్టును ఆశ్రయించిన రచయిత శరత్‌ చంద్ర. శరత్‌ చంద్ర పిటిషన్‌పై విచారణ జరిపి…. దర్శకుడు కొరటాల శివ పై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఆదేశించిన నాంపల్లి కోర్టు. నాంపల్లి కోర్టు ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన దర్శకుడు కొరటాల శివ. తెలంగాణ హైకోర్టు కూడా నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సమర్ధించడంతో… సుప్రీంకోర్టును ఆశ్రయించి శివ.

కొరటాల శివ దాఖలు చేసిన పిటిషన్‌ పై విచారణ జరిపిన జస్టిస్‌ హృషికేష్‌ రాయ్‌, జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర ధర్మాసనం. కొరటాల శివ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకుని తదుపరి విచారణ జరపడానికి ఏమీ లేదని స్పష్టం చేసిన ధర్మాసనం. పిటిషన్‌ డిస్మిస్‌ చేస్తామని లేదా వెనక్కి తీసుకుంటారా అని నిరంజన్‌ రెడ్డిని ప్రశ్నించిన ధర్మాసనం. తాను పిటిషన్‌ వెనక్కి తీసుకుంటా అని చెప్పగా… అనుమతించిన ధర్మాసనం.