ప్రపంచానికి నిజం తెలియాలి.. సుశాంత్ సింగ్ పై స్పెషల్ వీడియో

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి సంబంధించిన వార్తలు హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే. ఈ యువ హీరో మరణించి నెలలు గడుస్తున్నా ఇంకా మిస్టరీ వీడలేదు. అయితే సుశాంత్ మృతికి గల కారణం తెలియాలని దేశమే కాదు ఇప్పుడు ప్రపంచమంతా కోరుకుంటోంది. ఇక ఇటీవల సుశాంత్ కి నివాళి అర్పిస్తూ సుశాంత్ సోదరి ద్వారా ఒక సాంగ్ ని రిలీజ్ చేశారు.

యూఎస్ఏ యాక్టర్స్ జో శర్మ ఈ సాంగ్ ని రెడీ చేశారు. బుగోళమంతా సుశాంత్ కి న్యాయం జరగాలని కోరుకుంటోందని ఈ సందర్భంగా వారు కోరుతూ డేవోషనల్ వీడియోను రిలీజ్ చేశారు. ఇక సుశాంత్ కేసును బీహార్ ప్రభుత్వం కోరిక మేరకు సీబీఐకి తన చేతుల్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. మరికొన్ని రోజుల్లో కేసుకు సంబంధించి కీలక అంశాలు బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేసులో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.