సూపర్ స్టార్ రజినీకాంత్, మురుగదాస్ కలయికలో వస్తున్న మొదటి సినిమా ‘దర్బార్’. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలయ్యింది. అందరి కన్నా ముందు తన పార్ట్ షూట్ పూర్తి చేసిన రజిని, డబ్బింగ్ ని కూడా అందరికన్నా ముందే కంప్లీట్ చేశాడు. జనవరికి దర్బార్ తో రజినీ సూపర్ హిట్ ఇస్తాడని తలైవా అభిమానులు ఎదురు చూస్తుంటే, ఈ సినిమాతో అయినా రజినీ హిట్ ఇస్తాడా అని యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడే కాదు గత కొంత కాలంగా రజినీ టైం అయిపొయింది, రజినీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆడట్లేదు, రజినీని మించిన స్టార్స్ వచ్చేశారు… ఇలా రకరకాల విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా రజినీ గురించి ఒక స్పెషల్ ఆర్టికల్….
అది 1999-2005 కాలం, దాదాపు ఆరేళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న సూపర్ స్టార్ రజినీకాంత్ టైం అయిపొయింది అనే విమర్శలు వినిపిస్తున్న సమయం. బాషా ముత్తు అరుణాచలం లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ రజిని 1999లో వచ్చిన నరసింహా తర్వాత హిట్ లేదు. మూడేళ్లు గ్యాప్ తీసుకోని చేసిన బాబా కూడా పోయింది. ఇక రజినీ టైం అయిపొయింది సినిమాలు ఆపేయడం బెటర్ అనే మాట వినిపించింది. ఇలాంటి కష్టకాలంలో 14 ఏప్రిల్ 2005న రిలీజ్ అయిన సినిమా చంద్రముఖి. సూపర్ స్టార్ రేంజ్ ఏంటి? లేడీ పేరుతో సినిమా ఏంటి? ఇది కూడా పోతే రజినీ నిజంగానే సినిమాలు మానేయడం బెటర్ అనేశారు. ఈసారైనా రజినీ హిట్ కొడతాడా అనుకోని ఎదురు చూసిన వాళ్ల కలని నిజం చేస్తూ, కోలీవుడ్ రికార్డులు తిరగరాస్తూ రజినీ ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. డాక్టర్ శివాజీగా రజినీ తన మార్క్ స్టైల్ తో ఆకట్టుకున్నాడు. ఒక హారర్ కథకి, సూపర్ స్టార్ ఇమేజ్ కలవడంతో చంద్రముఖి ట్రేడ్ వర్గాలకే షాక్ ఇచ్చే రేంజులో హిట్ అయ్యింది. జ్యోతిక యాక్టింగ్, నయన్ పెర్ఫార్మెన్స్, రజినీ స్క్రీన్ ప్రెజెన్స్, పి వాసు టేకింగ్, విద్యాసాగర్ మ్యూజిక్… ఒక్కటేంటి చంద్రముఖి సినిమాకి అన్నీ కలిసొచ్చాయి. రజినీ టైం అయిపొయింది అన్న వాళ్లే వింటేజ్ రజినీ ఈజ్ బ్యాక్ అనేశారు.
చంద్రముఖి తర్వాత స్పీడ్ పెంచిన రజినీ, శంకర్ తో కలిసి తెలుగు తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు. శివాజీ, రోబో సినిమాలు రజినీకాంత్ ఇమేజ్ ని ఆకాశానికి, ఎవరికీ అందనంత ఎత్తుకి తీసుకెళ్లాయి. ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్ కథతో శంకర్ తీసిన రోబో సినిమా తలైవాకి పోటీ సాటి మరొకరు లేరు రారు అనే రేంజ్ హిట్ కొట్టాడు. ఇక రజినీకి తిరుగులేదు అనే మాట వినిపిస్తున్న టైములో సూపర్ స్టార్ మళ్లీ ఫ్లాపుల బాట పట్టాడు. నిజానికి రోబో తర్వాత నాలుగేళ్ల పాటు రజినీకాంత్ తెరపైనే కనిపించలేదు. చేసిన ఒక్క కొచ్చడయాన్ కూడా యానిమేషన్ మూవీ కావడంతో తలైవాని చూడడానికి అభిమానులు ఎంతగానే ఎదురు చూశారు. ఈ సమయంలో రజినీకి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన కేఎస్ రవికుమార్ కలిశాడు. ఈ కాంబినేషన్ లో లింగ సినిమా వచ్చింది. తలైవా కంబ్యాక్ ఇవ్వడం గ్యారెంటీ అనుకుంటే ఊహించని ఫ్లాప్ ఇచ్చాడు. మళ్లీ అదే మాట రజినీ టైం అయిపొయింది, ఆయన సినిమాలు మానేయడం బెటర్… ఇలాంటి సమయంలో ఇండియన్ సినిమాని షేక్ చేస్తూ, తలైవా అభిమానులందరినీ తట్టిలేపుతూ బయటకి వచ్చిన సినిమా కబాలి.
పా రంజిత్ దర్శకత్వంలో 2016లో వచ్చిన ఈ సినిమా, వింటేజ్ రజినీకాంత్ ని చూపించింది. బాషా తర్వాత రజిని డాన్ గా కనిపిస్తున్నాడు అనే వార్త స్ప్రెడ్ కాగానే సినీ అభిమానుల దృష్టంతా కబాలిపై పడింది. 130 కోట్ల బడ్జట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి చేసిన ప్రొమోషన్స్ ఏ ఇండియన్ సినిమాకి జరగలేదు అంటే అతిశయోక్తి కాదేమో. ఫ్లైట్స్, గోల్డ్ కాయిన్స్, పెన్స్… ఒక్కటేమిటి కంటికి కనిపించిన ప్రతిదాని మీద కబాలినే కనిపించింది. ఒక సినిమా రిలీజ్ కి వరల్డ్ వైడ్ లీవ్ ప్రకటించడం కబాలికి మాత్రమే దక్కింది. ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే 5 మిళియన్స్ వ్యూస్ రాబట్టిన కబాలి, ఆసియా కాంటినెంట్ లోనే టాప్ రికార్డు సృష్టించింది. చెన్నైలో టికెట్స్ దొరక్క ఫారిన్ కి వెళ్లి కబాలి చూసిన వాళ్లు వేళల్లో ఉన్నారు. 2015లో వచ్చిన బాహుబలి సినిమా సౌత్ ఇండియన్ రికార్డులు తిరగరాసింది. ఇక మళ్లీ బాహుబలి 2 వచ్చే వరకూ ఈ రికార్డులు బ్రేక్ అవ్వవు అనుకున్నారు. ఆ ఆలోచనలని పక్కన పడేస్తూ రజినీకాంత్ కబాలితో కాసుల వర్షమే కురిపించాడు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో చాలా చోట్ల బాహుబలి బిగినింగ్ రికార్డులని కబాలి చెరిపేసింది. రజినీ ముందు రికార్డులా జుజుబీ అనే రేంజులో వసూళ్ల వర్షం కురిపించిన కబాలి, ఒక ఫ్లాప్ సినిమా. ప్రేక్షకులని మెప్పించడంలో ఫెయిల్ అయిన సినిమాతో ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసిన రజినీకాంత్, ఇప్పటివరకూ హిట్ ఇవ్వలేదు.
కబాలి తర్వాత కూడా రజినీ కాలా, 2.0, పేట సినిమాలు చేశాడు. ఈ సినిమాలన్నీ డబ్బులు తెచ్చాయి కానీ కొంతమందికి నష్టాలు మిగిలించాయనే కామెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే మాట, వరసగా రజినీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి, మిగిలిన హీరోలు సూపర్ కలెక్షన్స్ రాబడుతుంటే రజినీకాంత్ మాత్రం నష్టాలు తెస్తున్నాయి అంటున్నారు. నిజమే మిగిలిన హీరోల సినిమాలు సూపర్ హిట్ అయి ఉండొచ్చు, అదిరిపోయే కలెక్షన్స్ తెస్తుండొచ్చు. అయితే వాళ్లందరినీ రజినీతో కంపేర్ చేస్తున్నారు అంటే వారందరి కన్నా ముందు రజినీకాంత్ ఉన్నట్లే కదా. సరే హీరో రేంజ్ ని డిసైడ్ చేసేది కలెక్షన్స్ ఏ అయితే ఫ్లాప్ సినిమాతో కూడా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తున్న రజినీ టైం ఎలా అయిపోతుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే భారీ కాన్వాస్, హ్యూజ్ బడ్జట్, నేషనల్ స్టార్స్ ఉంటేనే మిగిలిన హీరోలకి అది పాన్ ఇండియన్ సినిమా అవుతుందేమో కానీ రజినీ కనిపిస్తే చాలు అది పాన్ ఇండియా సినిమా అవుతుంది. రజినీ లాంటి లార్జర్ దన్ లైఫ్ ఉన్న హీరోకి ఎప్పుడూ టైం అయిపోదు, ఈ విషయం తన నెక్స్ట్ సినిమా దర్బార్ తో మరోసారి ప్రూవ్ చేయబోతున్నాడు. రజినీ టైం అయిపొయింది అన్న వాళ్ళతోనే, హీ ఈజ్ ఎవర్ గ్రీన్ విత్ ఎటర్నల్ స్టార్ డమ్ అనిపిస్తాడు… వెయిట్ అండ్ సీ…