‘స్పెషల్‌’ మూవీ స‌క్సెస్‌మీట్‌

Special movie success meet

అజ‌య్ కీల‌క పాత్ర‌లో న‌టించిన చిత్రం స్పెష‌ల్‌. ఇది ఒక మైండ్ రీడర్ లవ్ రివెంజ్ స్టోరీ. ఓ వ్యక్తిని ఒకమ్మాయి లవ్ చేసి వదిలేస్తుంది. చీట్ చేస్తుంది. ఆ అమ్మాయి అలా అతన్ని చీట్ చేయడానికి కారణమైన వాళ్లమీద ఈ మైండ్ రీడర్ రివెంజ్ తీర్చుకుంటాడు. మనుషుల్ని టచ్ చేసి వాళ్ల మైండ్ రీడ్ చేసే ఒక పారా సైకాలజీ స్కిల్ నేపథ్యంలో సాగుతుంది. హాలీవుడ్ తరహా కథాంశంతో తీసిన ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ ఇది. ఇందులో అజయ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. నందలాల్ క్రియేషన్స్ పతాకంపై నందమ్ శ్రీవాస్తవ్ నిర్మాతగా, వాస్తవ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. శుక్ర‌వారం విడుద‌లైంది.

చిత్ర దర్శకుడు వాస్తవ్ మాట్లాడుతూ సినిమాను చూసిన వారంద‌రూ జెన్యూన్‌గా బావుంద‌ని మెచ్చుకుంటున్నారు. గ‌త ప‌దేళ్ల‌లో ఇలాంటి క‌థ‌, స్క్రీన్ ప్లేను చూడ‌లేద‌ని ప్ర‌శంసిస్తున్నారు. బ‌డ్జెట్ కొర‌త కార‌ణంగా టెక్నిక‌ల్‌గా చిన్నా చిత‌కా లోపాలు ఉండ‌వ‌చ్చు. కాద‌న‌లేను. కానీ క‌థ‌, క‌థ‌నాన్ని మాత్రం ఎవ‌రూ త‌క్కువ‌చేసి మాట్లాడ‌లేదు. తెలుగులో ఎన్నో లుచ్ఛా సినిమాల‌ను నెత్తిన పెట్టుకుని చూశాం. కానీ మా `స్పెష‌ల్‌` లాంటి సినిమాల‌ను వ‌దిలేయ‌డం చాలా త‌ప్పు అని అన్నారు.
బాపిరాజు మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లోనూ 80కి పైగా థియేట‌ర్ల‌లో విడుద‌ల చేశాం. ప్ర‌తి ద‌గ్గ‌రా పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తోంది. క‌లెక్ష‌న్లు బావున్నాయి. హీరో, హీరోయిన్‌, అజ‌య్ అంద‌రూ బాగా చేశారు. మా ద‌ర్శ‌కుడిలో ఓ శంక‌ర్‌, ఓ మురుగ‌దాస్‌, ఓ రాజ‌మౌళి ఉన్నార‌ని ప్ర‌శంసిస్తున్నారు. త‌క్కుడ డ‌బ్బులతో తీసిన‌ప్ప‌టికీ ఎక్కువ క్వాలిటీతో సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది. మా శ్రీ ల‌క్ష్మీ పిక్చ‌ర్స్ ద్వారా విడుద‌ల చేశాం అని చెప్పారు.

హీరో రంగ మాట్లాడుతూ స్ట్రాంగ్ స్టోరీ, స్ట్రాంగ్ స్క్రీన్‌ప్లేతో తెర‌కెక్కిన చిత్ర‌మిది. గ‌జినీ త‌ర్వాత అంత మంచి స్క్రీన్‌ప్లే మా సినిమాకే కుదిరింద‌ని చెబుతున్నారు. థియేట‌ర్ల‌లో ఎంక్వ‌య‌రీ చేస్తే పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తోంది. సినిమా చూసిన వాళ్ల‌ను అడ‌గండి. వాళ్లు బావుంద‌ని స‌ల‌హా ఇస్తేనే చూడండి. సినిమా చూసిన వారికి త‌ప్ప‌క న‌చ్చుతుంది అని అన్నారు.

నాయిక అక్ష‌త మాట్లాడుతూ ఈ సినిమాలో భాగ‌మైనందుకు ఆనందంగా ఉంది. అజ‌య్ చాలా ఆగా న‌టించారు. రంగ పాత్ర మైండ్ రీడ‌ర్‌గా ఆక‌ట్టుకుంటోంది. ద‌ర్శ‌కుడు చాలా బాగా తెర‌కెక్కించారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సినిమా బోర్ కొట్ట‌దు. ఫ్యామిలీ సెంటిమెంట్ నుంచీ ప్ర‌తిదీ చాలా బావుంది. ఇంకాస్త బ‌డ్జెట్‌లో తీసి ఉంటే ఇంకా బాగా ఉండేది అని చెప్పారు.

నటీనటులు
అజయ్, రంగ, అక్షత, సంతోష, అశోక్ కుమార్, బిహెచ్ఈఎల్ ప్రసాద్, జబర్దస్త్ అప్పారావ్, ప్రకాష్, మహేష్, చక్రపాణి, కమలేష్, వర్షిత్, బిహెచ్ఈఎల్ సునీల్, గౌతమ్ తదితరులు

సాంకేతిక వర్గం
బ్యానర్ – నందలాల్ క్రియేషన్స్
నిర్మాత – నందమ్ శ్రీ వాస్తవ్
డైరెక్టర్ – వాస్తవ్
మ్యూజిక్ డైరెక్టర్ – ఎన్వీఎస్ మన్యం
ఫొటోగ్రఫీ – బి అమర్ కుమార్
ఎడిటింగ్ – ఎస్ బి ఉద్దవ్
ప్రొడక్షన్ కంట్రోలర్ – బిఎస్ నాగిరెడ్డి
కో డైరెక్టర్ – ప్రణీత్ వర్మ
సౌండ్ రికార్డింగ్ – సాగర్ స్టూడియోస్
సిజి అండ్ డీఐ – క్రిష్ణ ప్రసాద్