కీడాకోలా దర్శకుడు తరుణ్ భాస్కర్ కు వార్నింగ్ ఇచ్చిన ఎస్ పి చరణ్

తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ‘కీడాకోలా’ చిత్రబృందానికి ఎస్పీ చరణ్ లీగల్ నోటీసులు పంపారు. అనుమతి లేకుండా తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతును ఏఐ టెక్నాలజీ ద్వారా రీక్రియేట్ చేసి వాడుకున్నందుకు ‘కీడాకోలా’ యూనిట్, సంగీత దర్శకుడు వివేక్ సాగర్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి జనవరిలోనే నోటీసులు పంపినట్లు ఆయన తెలిపారు. ‘మా నాన్న గొంతుకు జీవం పోసిన ఏఐ టెక్నాలజీని స్వాగతిస్తున్నాం. ఇలా చేసే ముందు మా అనుమతి తీసుకొని ఉండాల్సింది. వ్యాపారం కోసం ఇలాంటి పనులు చేయడం సమంజసం కాదు’ అని ఆయన పేర్కొన్నారు. అనుమతి లేకుండా ఒక గొప్ప వ్యక్తి గొంతును ఉపయోగించుకోవడం చట్టవిరుద్ధమన్నారు. ప్రతిగా తమకు క్షమాపణలు చెప్పడంతో పాటు నష్టపరి హారం చెల్లించాలని డిమాండ్ చేశారు.