గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం పరిస్థితి మరోసారి విషమంగా మారినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా ఆయన కరోనా వైరస్ కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అఫీషియల్ గా హాస్పిటల్ నుంచి ప్రెస్ నోట్ ను కూడా రిలీజ్ చేయడంతో అభిమానులంతా ఆయన వీలైనంత త్వరగా కొలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. కొరోనావైరస్ పాజిటివ్ వచ్చిన తరువాత దాదాపు రెండు నెలల నుండి చికిత్స పొందుతున్నారు.
లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం ఆయన మెదడుకి సంబంధించిన వ్యాదితో కూడా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి తీవ్రమైన స్థితిలో మళ్ళీ ఆయనను ఐసియులోకి తరలించారు. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం కోసం వైద్యులు తమ వంతు కృషి చేస్తున్నారు. ఎంజిఎం ఆస్పత్రులు కూడా ఒక ప్రకటన విడుదల చేశారు, అతను పూర్తిగా లైఫ్ సపోర్ట్ తో ఉన్నారు. గత 24 గంటల నుంచి ఆయన ఆరోగ్యం ఎంతగానో క్షీణిస్తోందని ఆయనకు చికిత్స అందించేందుకు ప్రత్యేక వైద్య బృందం కూడా కృషి చేస్తున్నట్లు వివరణ ఇచ్చారు.