ట్రోలింగ్ పై సోనూ సూద్ సింపుల్ కౌంటర్.. డబ్బులు వస్తే సంతోషమే

Sonu Sood

లాక్ డౌన్ మొదలవ్వగానే సాదారణ పేద ప్రజలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన మొదటి బాలీవుడ్ నటుడు సోనూ సూద్. వలసదారులను సొంత ఇంటికి చేర్చడం నుంచి పెద విద్యార్థులకు ఆన్ లైన్ విద్యను ఉచితంగా అందేలా సహాయం చేయడం వరకు సోనూ లక్షలాది మందికి సహాయాన్ని అందించారు. కానీ కొంతమంది ఫేక్ ఎకౌంట్స్ తో సోనూ సూద్ పై అసత్య ప్రచారాలు చేస్తున్నారు.

2020లో సోనూ సూద్ పెద్ద స్కామ్ ఎదో చేస్తున్నాడని ట్రోల్ చేయడం కూడా అందరిని షాక్ కి గురి చేసింది. అయితే ఈ విషయంపై సోనూ సున్నితంగా కౌంటర్ ఇచ్చాడు. ఆ విషయాల గురించి పట్టించుకునే సమయం కూడా నాకు లేదు. ఆ ట్రోలింగ్ వల్ల డబ్బులు వస్తే అది మంచి విషయమే. ఆ డబ్బులతో లేని వారికి సహాయం చేయమని నేను కోరుతున్నాను.. అని సోనూ వివరణ ఇచ్చాడు. ఇక గత నాలుగు నెలల్లో అతను దాదాపు 7,03,200 మంది వ్యక్తులకు సహాయాన్ని అందించిన్నట్లు PR టీమ్ తెలియజేసింది. సహాయం పొందిన వారి పూర్తి జాబితా, వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఆధార్ కార్డు వివరాలు కూడా ఉన్నట్లు వారు వివరణ ఇచ్చారు.