ఏషియాలోనే సోనూసూద్ నెంబర్ 1

లాక్‌డౌన్‌లో ఎంతోమంది వలస కార్మికులను బస్సులు, ట్రైన్లు, విమనాల ద్వారా వారి సొంతూళ్లకు పంపి హెల్ప్ చేశాడు ప్రముఖ నటుడు సోనూసూద్. ప్రభుత్వాలే వలస కార్మికుల సమస్యలను పట్టించుకోని నేపథ్యంలో వారికి సాయం చేసిన సోనూసూద్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగ్రిపోయింది. అప్పటివరకు కొంతమందికి మాత్రమే తెలిసిన సోనూసూద్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా అందిరికీ తెలిసింది. వలస కార్మికులకు కాదు… తమకు సహాయం కావాలని ఆయనను ట్విట్టర్‌లో కోరిన ప్రతిఒక్కరికీ సోనూసూద్ సహాయం చేశాడు. లాక్‌డౌన్‌లో ఉద్యోగాలు కోల్పోయిన ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించాడు.

sonusood

దీంతో ఎంతోమంది సెలబ్రెటీల కన్నా సోనూసూద్ బెస్ట్ అని నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో తాజాగా బ్రిటన్‌‌కు చెందిన ఈస్ట్రన్ ఐ న్యూస్ పేపర్ విడుదల చేసిన టాప్ 50 ఆసియన్ సెలెబ్రెటీ జాబితాలోని టాప్ 10లో సోనూసూద్ పేరు సంపాదించుకున్నాడు. టాప్ 1లో సోనూసూద్ ఉండగా.. టాప్ 7లో ప్రభాస్ ఉన్నాడు. బాహుబలి తర్వాత అంతర్జాతీయ స్టార్‌గా ప్రభాస్ ఎదగగా.. సాహో సినిమాతో బాలీవుడ్‌తో మంచి పేరు తెచ్చుకున్నాడు.

ఆ తర్వాత ఇప్పుడు ఆదిపురుష్, సలార్, మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ల డైరెక్షన్‌లో మూడు పాన్ ఇండియా సినిమాల్లో నటించనున్నాడు. దీంతో ఇండియాలోనే టాప్ హీరోగా ప్రభాస్ పేరు సంపాదించుకున్నాడు. ఇక ఇండియన్ సింగర్ అర్మాన్ మాలిక ఐదవ స్థానంలో ఉండగా.. 6వ స్థానంలో బాలీవుడ్ అందాల తార ప్రియాంక చోప్రా ఉంది.

ఇక రెండో స్థానంలో కెనడా సోషల్‌ మీడియా స్టార్‌ లిల్లీ సింగ్‌ నిలిచారు. టాప్ 1గా నిలవడంపై సోనూసూద్ స్పందించాడు. తన ప్రయత్నాలను గుర్తించినందుకు ఈస్టర్న్‌ ఐ పత్రికకు థ్యాంక్స్ చెప్పారు. కరోనా‌ సమయంలో తాను తన బాధ్యతగా తన దేశ పౌరులకు అండగా నిలబడ్డానని, దేశ ప్రజలు తనపై చూపించిన ప్రేమ, ఆప్యాయతలను మర్చిపోలేనన్నారు. తన సేవా కార్యక్రమాలను తన చివరి శ్వాస ఉన్నంత వరకు ఆపబోనన్నారు.