సోనూసూద్ షాకింగ్ నిర్ణయం.. ఆస్తులు తాకట్టు

రీల్ హీరో కాదు.. రియల్ హీరో అనిపించుకుంటూనే ఉన్నాడు ప్రముఖ నటుడు సోనూసూద్. ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందిస్తూనే ఉన్నాడు. తనకు తొచినంత సహాయం చేస్తూ ఆపదలో ఉన్నవారికి కష్టాలు తీర్చుతున్నాడు. ఏకంగా సాహయం చేసేందుకు డబ్బులు లేక తన ఇంటినే సోనూసూద్ తాకట్టు పెట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

sonusood

దాదాపు రూ.10 కోట్ల విరాళం పోగుచేసుకోవడానికి ముంబైలోని జుహూలో గత ఎనిమిది ఆస్తుల్ని సోనూసూద్ తాకట్టు పెట్టాడట. ఇందులో రెండు దుకాణాలు, ఆరు ప్లాట్లు ఉన్నాయని తెలుస్తోంది. సెప్టెంబర్ 15న అగ్రిమెంట్లపై సంతకం చేయగా.. నవంబర్ 24న రిజిస్ట్రేషన్ జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా జెఎల్ ఎల్ ఇండియా రెసిడెన్షియల్ సర్వీసెస్ సీనియర్ డైరెక్టర్ హెడ్ రితేష్ మెహతా ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

పక్కవాడు ఎలా ఉంటే మనకేందుకు. మనం బాగున్నాము కదా అని ఆలోచించే వాళ్లు ఈ రోజుల్లో ఉన్నారు. కానీ ఎవరో తెలియని వారి సమస్యలను తెలుసుకుని వెంటనే హెల్ప్ చేస్తున్నాడు సోనూసూద్. లాక్‌డౌన్ లో సినిమా షూటింగ్‌లు నిలిచిపోవడంతో సోనూసూద్ చేస్తున్నసినిమాలన్నీ ఆగిపోయాయి. దీంతో ఆయనకు ఇన్ కమ్ కూడా లేదు. అయినా తన దగ్గర ఉన్న డబ్బులను ఖర్చు పెట్టి వేలమంది వలస కార్మికులను తమ సొంతూళ్లకు పంపించాడు. ప్లైట్స్, విమానాలు, బస్సుల ద్వారా వలస కార్మికులకు తమ ఇళ్లకు పంపించాడు. ఇక ఉద్యోగం కోల్పోయిన వారికి ఉద్యోగులు కల్పించాడు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. వేలమందికి సోనూనూద్ సహాయం చేశాడు.