హృతిక్ సినిమా నుంచి కృతి ఔట్.. కియారా ఇన్

బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ హీరోగా రానున్న ‘క్రిష్ 4’ సినిమా గురించి ఒక వార్త హాట్‌టాపిక్‌గా మారింది. హృతిక్ ఫాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ముందుగా ఇందులో హీరోయిన్‌గా కృతి సనన్‌ను తీసుకోవాలని ఆమెను మేకర్స్ సంప్రదించారు. దీంతో ఆమె కూడా నటించేందుకు ఓకే చెప్పింది. కానీ కృతి వరుస షెడ్యూల్స్‌తో బిజీగా ఉంది. ఆమె చేతిలో చాలా ప్రాజెక్టులు ఉండటంతో కుదరకపోవడం వల్ల క్రిష్ 4 నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

kiara advani

దీంతో కృతిసనన్ స్థానంలో కియారా అద్వానిని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కియారా అద్వానినీ మేకర్స్ సంప్రదించగా.. ఈ బ్యూటీ ఓకే చెప్పినట్లు సమాచారం. ఇందులో ఇద్దరు హీరోయిన్లు కావాల్సి ఉంది. ఇందులో మెయిన్ రోల్‌కు కృతిని తీసుకున్నారు. కానీ ఆమె చేతిలో 5 ప్రాజెక్టులు ఉండటంతో క్రిష్ 4లో నటించేందుకు వీలు కావడం లేదు. దీంతో కియారాను తీసుకున్నట్లు తెలుస్తోంది.

త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. హృతిక-కియారా కాంబినేషన్ కొత్తగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం కియారా బాలీవుడ్‌తో పాటు పలు భాషల్లో కూడా సినిమాలు చేస్తోంది. తెలుగులో మహేష్ బాబు పక్కన భరత్ అనే నేను సినిమాలో నటించిన ఈభామ.. వినయ విధేయ రామ సినిమాలో కూడా నటించింది.