“దిల్ రూబా” నుండి పాట రిలీజ్

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా “దిల్ రూబా”. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. “దిల్ రూబా” చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్,  ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. “దిల్ రూబా” సినిమా మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈవెంట్ లో “దిల్ రూబా” సెకండ్ సింగిల్ ‘హే జింగిలి..’ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా

ప్రొడ్యూసర్ రవి మాట్లాడుతూ – మా “దిల్ రూబా” సినిమా సెకండ్ సింగిల్ ‘హే జింగిలి..’ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. సినిమాను అందరికీ నచ్చేలా చేసిన మా టీమ్ కు థ్యాంక్స్. నేను ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి సారెగమా వాళ్లు మాతో టైఅప్ అయ్యారు. మాది పాన్ ఇండియా రిలీజ్ మూవీ కాకపోయినా పాన్ ఇండియా ప్రొడక్షన్ తో కలిసి సినిమా చేశాం. మార్చి 14న మీ ముందుకు రిలీజ్ కు వస్తున్నాం. “దిల్ రూబా” తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాం. అన్నారు.

కొరియోగ్రాఫర్ ఈశ్వర్ పెంటి మాట్లాడుతూ – “దిల్ రూబా” మూవీలో హే జింగిలీ పాటకు కొరియోగ్రాఫీ చేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు విశ్వకరుణ్ కు థ్యాంక్స్. ఈ పాటలో కిరణ్ గారిని అర్బన్ లుక్ లో మంచి స్టెప్స్ చేయించామని కిరణ్ గారి ఫ్యాన్స్ నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వెళ్తుందని ఆశిస్తున్నాం. భాస్కరభట్ల గారి లిరిక్స్ నేను కొరియోగ్రఫీ చేసేందుకు చాలా హెల్ప్ అయ్యాయి. రుక్సర్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఈ పాటను, సినిమాను మీరంతా సూపర్ హిట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

లిరిక్ రైటర్ భాస్కరభట్ల మాట్లాడుతూ – హే జింగిలి పాట మొదట్లో మేము అనుకున్నట్లు రాలేదు. సామ్ గారిని కలిసి మీ దగ్గరున్న ట్యూన్ ఏదైనా ఉంటే ఇవ్వండి అని అడిగాము. ఆయన మొహమాటపడుతూనే నచ్చుతుందో నచ్చదో అని ఒక ట్యూన్ ఇచ్చారు. వింటే అద్భుతంగా అనిపించింది. వెంటనే కిరణ్ గారికి, డైరెక్టర్ విశ్వ గారికి వినిపించి ఓకే చేశాం. అలా హే జింగిలి పాట తయారైంది. “దిల్ రూబా” సినిమాకు ఆయువు పట్టులాంటి పాట ఇది. సినిమా సక్సెస్ లో ఈ పాటకు క్రెడిట్ దక్కుతుంది. నేను హీరో కిరణ్ అబ్బవరంను సోదరుడిలా భావిస్తా. ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమా నుంచి మేము కలిసి ట్రావెల్ చేస్తున్నాం. అగ్నికి ఆజ్యంలా మా ఇద్దరికీ డైరెక్టర్ విశ్వకరుణ్ తోడయ్యారు. రుక్సర్ గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. అలాగే ఈశ్వర్ మంచి కొరియోగ్రఫీ చేశారు. “దిల్ రూబా” సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ విశ్వ కరుణ్ మాట్లాడుతూ – హే జింగిలి పాటను మీరంతా ఎంజాయ్ చేశారని నమ్ముతున్నాం. ఈ పాటలో కిరణ్ గారు, రుక్సర్ పెయిర్ చాలా బాగుంది. ఫస్ట్ టైమ్ లవ్ లో పడిన అబ్బాయి కింగ్ లా ఫీలవుతాడు. ఆ లవ్ ఫెయిలై సెకండ్ టైమ్ లవ్ లో పడినప్పుడు అతనిలో ఒక భయం మొదలవుతుంది. ఇలాంటి ఒక ఎక్స్ ప్రెషన్ చెప్పగానే భాస్కరభట్ల గారు సూపర్బ్ లిరిక్స్ ఇచ్చారు. సామ్ సీఎస్ గారు సూపర్ హిట్ ట్యూన్ ఇచ్చారు. గంటలో ఈ పాట రెడీ అయ్యింది. దిల్ రూబాలో హే జింగిలి సాంగ్ కు మంచి పేరొస్తుంది. మీరంతా మా మూవీకి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.

హీరోయిన్ రుక్సర్ థిల్లాన్ మాట్లాడుతూ – “దిల్ రూబా” మూవీ ప్యూర్ లవ్ ఎమోషన్, ఫీలింగ్ తో ఉంటుంది. నా క్యారెక్టర్ ద్వారా ఫుల్ లవ్ అండ్ ఎమోషన్ చూపించాను. మా మూవీ రిలీజ్ కొంచెం ఆలస్యమైంది. రంగుల పండుగ హోలీ సందర్భంగా ఈ కలర్ ఫుల్ లవ్ స్టోరీతో మార్చి 14న రిలీజ్ కు వస్తున్నాం. ఈ మూవీలో నా క్యారెక్టర్ కు ప్రాధాన్యత ఉంటుంది. నా క్యారెక్టర్ ద్వారా మంచి ఎమోషన్ చూపించే అవకాశం దక్కింది. నాకు, కిరణ్ కు మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. మీరంతా థియేటర్ లో మూవీ చూసి ఇచ్చే రెస్పాన్స్ కోసం వేచి చూస్తున్నా. మీతో కలిసి మా టీమ్ అంతా మూవీ చూడాలనుకుంటున్నాను. నాతో వస్తావా అని హే జింగిలి పాటలో ఒక లైన్ ఉంది. అలా మీరంతా మార్చి 14న థియేటర్స్ లోకి “దిల్ రూబా” చూసేందుకు మాతో వస్తారా. మా టీమ్ అంతా వెయిట్ చేస్తున్నాం. అన్నారు.

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – “దిల్ రూబా” మూవీ చేసినందుకు చాలా గర్వంగా హ్యాపీగా ఫీలవుతున్నాను. ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా “దిల్ రూబా” మీ అందరినీ ఆకట్టుకుంటుంది. సారెగమా వాళ్లు ఫస్ట్ టైమ్ ఈ మూవీతో టాలీవుడ్ లోకి వస్తున్నారు. ప్రొడ్యూసర్ రవి గారు, డైరెక్టర్ విశ్వకరుణ్ మూడేళ్లుగా ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడ్డారు. వాళ్ల కోసమైనా ఈ మూవీ తప్పకుండా సక్సెస్ కావాలి. వాలెంటైన్స్ డే సందర్భంగా “దిల్ రూబా” రిలీజ్ చేయాలని అనుకున్నాం. అయితే కంగారుగా మూవీని రిలీజ్ చేయడం ఎందుకని ఆగాం. సంక్రాంతి సినిమాలు కంప్లీట్ అయ్యాక, కంటెంట్ ను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని,  ప్రమోషన్ ప్లాన్ చేసుకుని మార్చి 14న హోలీ పండుగ రోజు రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాం. హోలీ మంచి డేట్. ప్రొడ్యూసర్స్ సపోర్ట్ వల్ల ఎలాంటి తొందరపాటు లేకుండా మూవీని రిలీజ్ చేయగలుగుతున్నాం. రుక్సర్ ఈ రోజు ఈవెంట్ కు వచ్చింది. తనతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. హే జింగిలి పాటలో మా పెయిర్ బాగుంటుంది. భాస్కరభట్ల నన్ను బ్రదర్ లా చూసుకుంటారు. ఎస్ఆర్ కల్యాణమండపం సినిమా నుంచి మేము కలిసి ట్రావెల్ చేస్తున్నాం. నా మూవీకి పాట రాసేప్పుడు ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. ఆయనకు పాట వెళ్తుందంటే నేను నిశ్చింతగా ఉంటాను. సామ్ సీఎస్ గారు “దిల్ రూబా”కు బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. అగ్గిపుల్లె ఛాట్ బస్టర్ అయ్యింది. హే జింగిలి పాటకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. త్వరలోనే థర్డ్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నాం. సామ్ సీఎస్ గారి బీజీఎం చూశాక ఈ సినిమాను మీరు థియేటర్స్ లో మరింతగా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం కుదిరింది. నా సినిమాలన్నింటిలో “దిల్ రూబా”లో ఇంటెన్స్ క్యారెక్టర్ చేశాను. నా క్యారెక్టర్ లాగే యాక్షన్ ఎపిసోడ్స్ ఇంటెన్స్ గా ఉంటాయి. “దిల్ రూబా” యాక్షన్ ఎపిసోడ్స్ స్క్రీన్ మీద కొత్తగా ఉండి ఎంజాయ్ చేస్తారు. పృథ్వీ మాస్టర్ చాలా బాగా ఈ ఫైట్స్ డిజైన్ చేశారు. టీజర్ ట్రైలర్ లో ఏది చూపించామో అదే సినిమాలో ఉంటుంది ఎక్కడా అనవసరపు కంటెంట్ పెట్టలేదు. మూవీని మ్యూజికల్ ఆకట్టుకునేలా చూపించబోతున్నాం. మా కంటెంట్ మీకు నచ్చితే మార్చి 14న థియేటర్స్ లో “దిల్ రూబా” చూసి సపోర్ట్ చేయండి. అన్నారు.

హే జింగిలి పాటను టాలెంటెడ్ మ్యుజీషియన్ సామ్ సీఎస్ కంపోజ్ చేసి బ్యూటిఫుల్ గా పాడారు. ఈ పాటకు భాస్కరభట్ల క్యాచీ లిరిక్స్ అందించారు. హే జింగిలి పాట ఎలా ఉందో చూస్తే – హే జింగిలి, హే జింగిలి నా జిందగీ నిండుగా జల్లావు రంగులే, హే జింగిలి, హే జింగిలి నా సింగిలు లైఫ్ నే తిప్పావే రింగులే..లబ్ డబ్ లబ్ డబ్ హార్ట్ బీటు ఆగిపోయే, లవ్ లవ్ లవ్ లవ్ పాటలాగ మారిపోయే..అంటూ రొమాంటిక్ లవ్ ఫీల్ తో ఆకట్టుకుంటోంది.

నటీనటులు – కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్, తదితరులు

టెక్నికల్ టీమ్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్) & దుడ్డి శ్రీను.
ప్రొడక్షన్ డిజైనర్ – సుధీర్
ఎడిటర్ – ప్రవీణ్.కేఎల్
సినిమాటోగ్రఫీ – డానియేల్ విశ్వాస్
మ్యూజిక్ – సామ్ సీఎస్
నిర్మాతలు – రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి,సారెగమ.
రచన, దర్శకత్వం – విశ్వ కరుణ్