‘యుఫోరియా’ నుంచి సాంగ్ లాంచ్

గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద నీలిమ గుణ నిర్మాణంలో గుణ శేఖర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘యుఫోరియా’. నూతన నటీనటులతో గుణ శేఖర్ ఓ ట్రెండీ టాపిక్‌ మీద ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో భూమిక చావ్లా, సారా అర్జున్, నాసర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి, అడ్డాల పృధ్వీరాజ్, కల్ప లత, సాయి శ్రీనికా రెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకాష్, నవీనా రెడ్డి, లికిత్ నాయుడు వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. శనివారం నాడు (మే 24) ఈ చిత్రం నుంచి ‘ఫ్లై హై’ అంటూ ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు ఏఎంబీలోని శరత్ సిటీ మాల్‌లో సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.

‘ఫ్లై హై’ అంటూ సాగే ఈ పాటను కిట్టు విస్సాప్రగడ రచించారు. కాళ భైరవ అందించిన బాణీ ట్రెండీగా ఉంది. ఇక ఈ పాటను కాళ భైరవ, పృథ్వీ చంద్ర, గాయత్రి నటరాజన్ ఆలపించారు. ఈ పాట పిక్చరైజేషన్ చూస్తుంటే నేటి యూత్, మత్తులో మునగడం, నైట్ అవుట్స్, ఫ్రెండ్స్‌తో చిల్ అవ్వడం వంటి అంశాలను చూపించారు. యూత్‌కు ఇన్ స్టంట్ కిక్ ఇచ్చేలా ఈ పాటను గుణ శేఖర్ పిక్చరైజ్ చేసినట్టు కనిపిస్తోంది. సాంగ్ లాంచ్ కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో

దర్శకుడు గుణ శేఖర్ మాట్లాడుతూ .. ‘ఆడియెన్స్ చూపించే ఎనర్జీయే ‘యుఫోరియా’. ఇదే ఎనర్జీ సినిమాలోనూ ఉంటుంది. ఈ ‘ఫ్లై హై’లానే ఇంకో మూడు పాటలు ఉంటాయి. అన్నీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. కాళ భైరవ అద్భుతమైన పాటలు ఇచ్చారు. కంప్లీట్ యూత్ ఫుల్ బ్యాక్ డ్రాప్‌తో ఈ మూవీని తీస్తున్నాను. మా హీరో విఘ్నేశ్, మా విలన్ పృథ్వీని అందరూ ఆశీర్వదించాలి. నా ఫ్యామిలీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. మా పాటల్ని ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. ఆడియెన్స్‌ను ఏ మాత్రం నిరాశపర్చదని భావిస్తున్నాను. అందరికీ మా సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను. నేను ఎప్పుడు ఏ సినిమా చేసినా ఒకే జానర్, ఒకే బ్యాక్ డ్రాప్‌లో ఉండవు. నాకు నచ్చిన కథల్ని ఎప్పుడూ కొత్తగా ప్రయత్నిస్తూనే వచ్చాను. అలా చిరంజీవి గారితో‘చూడాలని వుంది’ అని చేసినా, ఎన్టీఆర్‌తో ‘రామాయణం’ చేసినా మహేష్ బాబుతో ‘ఒక్కడు’ చేసినా నన్ను ఆశీర్వదిస్తూ వచ్చారు. ఈ ‘యుఫోరియా’ కథను నేను, నా ఫ్యామిలీ చాలా నమ్మింది. అందుకే నేను ఈ మూవీని తీశాను. ఆడియెన్స్‌కి కూడా మా చిత్రం అందరికీ నచ్చుతుందని, ఆడియెన్స్‌ను మెప్పిస్తుందని చెబుతున్నా’ అని అన్నారు.

నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ .. ‘అందరికీ మా ఫస్ట్ సింగిల్ ‘ఫ్లై హై’ నచ్చిందని భావిస్తున్నాను. ఇంత మంచి పాటను ఇచ్చిన కాళ భైరవ గారికి థాంక్స్’ అని అన్నారు.

కాళ భైరవ మాట్లాడుతూ .. ‘‘ఫ్లై హై’ పాట అందరికీ నచ్చుతుందని నేను కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను. ఇది అన్ని సినిమాల్లా నార్మల్‌గా ఉండదు. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అందుకే నేను కూడా చాలా డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చేందుకు ట్రై చేశాను. ఇందులోని పాటలన్నీ నచ్చుతుంది. సినిమా కూడా అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.

విఘ్నేష్ గవిరెడ్డి మాట్లాడుతూ ..‘‘ఫ్లై హై’ సాంగ్ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం. ముందు ముందు ఇంకా మరిన్ని అప్డేట్లతో వస్తాం. మేం అంతా కలిసి ఓ మంచి సినిమాను చేశాం. అందరి సహకారం మా సినిమాకి ఉండాలి’ అని అన్నారు.

పృథ్వీరాజ్ అడ్డాల మాట్లాడుతూ .. ‘కాళ భైరవ అద్భుతమైన పాట ఇచ్చారు. ‘ఫ్లై హై’ పాట అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను’ అని అన్నారు.

కొరియోగ్రాఫర్ ఈశ్వర్ మాట్లాడుతూ .. ‘చాలా తక్కువ టైంలోనే గుణ శేఖర్ లాంటి దర్శకుడితో పని చేసే ఛాన్స్ వచ్చింది. ఈ చిత్రం ఎంత ట్రెండీగా ఉంటుందో, కొత్తగా ఉంటుందో త్వరలోనే తెలుస్తుంది. ‘ఫ్లై హై’ సాంగ్ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. విఘ్నేశ్ రూపంలో మనకు కొత్త హీరో దొరికినట్టు అనిపిస్తుంది’ అని అన్నారు.

నటీనటులు : భూమిక చావ్లా, సారా అర్జున్, నాసర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి, అడ్డాల పృధ్వీరాజ్, కల్ప లత, సాయి శ్రీనికా రెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకాష్, నవీనా రెడ్డి, లికిత్ నాయుడు తదితరులు

సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: గుణశేఖర్
సమర్పణ: రాగిణి గుణ
నిర్మాత: నీలిమ గుణ
సంగీతం: కాల భైరవ
సినిమాటోగ్రాఫర్: ప్రవీణ్ కె పోతన్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
డైలాగ్స్: నాగేంద్ర కాశి, కృష్ణ హరి
పీఆర్వో : వంశీ కాకా