హీరోయిన్లు బికినీలు వేసుకుని ఎక్స్పోజింగ్ ఇవ్వడం కామన్. అలాగే పొట్టిపొట్టి దుస్తులు వేసుకుని అభిమానులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ సింగర్లకు హాట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. అయితే ఒక సింగర్ మాత్రం హీరోయిన్స్‌లా సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ పెడుతూ కుర్రాళ్లలో హీట్ పుట్టిస్తోంది. ఆమె బాలీవుడ్ హాట్ సింగర్ సోనా మొహపాత్ర.
ఆమె పెడుతున్న హాట్ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఒక నెటిజన్.. సింగర్ అయిన మీకు ఇలాంటి ఫొటోషూట్లు అవసరమా?. ప్రతి ఫొటోలో క్లీవేజ్ను ఎక్కువగా చూపిస్తున్నారు?. ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు? అని కామెంట్ చేశాడు. దీనిపై సోనా ఘాటుగా స్పందించింది.
తన శరీరం తన ఇష్టమని, తన క్లీవేజ్ తనకు ఎలా నచ్చితే అంతా ఉంటానని రిప్లై ఇచ్చింది. తనకు నచ్చినట్లుగా నేను ఉంటానని, నీకేమన్నా ఇబ్బందా అని ఘాటుగా స్పందించింది. నా బాడీని నా ఇష్టమొచ్చినట్లు చూపిస్తానని చెప్పింది. ఆమె సమాధానానికి నెటిజన్లు అవాక్కవుతున్నారు. మరికొందరు మాత్రం పాటలపై దృష్టి పెట్టమంటూ సలహా ఇస్తున్నారు.