‘దాసరి’కి ఘన నివాళులు!!

దర్శకరత్న స్వర్గీయ దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని… ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలోని ఆయన విగ్రహాన్ని సందర్శించి ఘన నివాళులు అర్పించారు. ‘మా అధ్యక్షులు వి.కె.నరేష్, ప్రముఖ నిర్మాతలు సి.కళ్యాణ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కొరియోగ్రఫర్ సత్య మాస్టర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో అన్నదానం చేశారు!!