Tollywood: “సొగసు చూడ తరమా సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన తనికెళ్ళ భరణి!

Tollywood: శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ , క్రియేటివ్ థింక్స్ గ్యాంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా సొగసు చూడ తరమా, తల్లాడ సాయి కృష్ణ స్వీయ దర్శకత్వంలో, నక్షత్ర హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఉమెన్స్ డే సందర్భంగా ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి గారు విడుదల చేశారు. ఈ సందర్భంగా తనికెళ్ల భరణి గారు మాట్లాడుతూ కంటెంట్ ఉన్న సినిమాల్ని ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు, ఆరు సంవత్సరాలు నుంచి సాయికృష్ణ ని చూస్తున్నాను. సాయి కృష్ణ, వాళ్ళ టీం కలిసి చేసే వర్క్ చూస్తే ముచ్చట వేస్తుంది. సొగసు చూడ తరమా ఫస్ట్ లుక్ ని ఉమెన్స్ డే సందర్భంగా విడుదల చేయడం చాలా సంతోషం గా ఉంది. టైటిల్ వింటుంటే ఒక మంచి లవ్ స్టోరీ చిత్రంలా అనిపిస్తుంది. సాయి కృష్ణ , నక్షత్ర ఇద్దరు ముచ్చటగా ఉన్నారు. సినిమా విజయవంతం అవ్వాలి అని కోరుకుంటున్నాను.


Tollywood డైరెక్టర్, హీరో తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ.. సొగసు చూడ తరమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన తనికెళ్ల భరణి గారికి ధన్యవాదాలు. ఇది ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ.. అరకు లోయ జరిగే అందమైన కథ. హాస్యాన్ని జోడిస్తూ చక్కని సందేశాన్నిచ్చే ఒక మంచి సినిమా ఇది. ఉమెన్స్ డే రోజు ఆడవారిని సన్మానించడం కాకుండా ప్రతిరోజు వారిని గౌరవిస్తే చాలు అది నిజమైన సన్మానం.

Tollywood హీరోయిన్ నక్షత్ర మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఉమెన్స్ డే రోజు ఫస్ట్ లుక్ ని విడుదల చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నా పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. మీ అందరికి నచ్చుతుంది అని నమ్ముతున్నాను అని తెలిపారు.

Tollywood నిర్మాత తల్లాడ శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక మంచి లవ్ స్టొరీ ని ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు చూపించబోతున్నాం, ఎక్కడ రాజీ పడకుండా ఈ సినిమా ని కథ లో ఉన్నది ఉన్నట్లుగా తెరక్కెక్కిస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో కో డైరెక్టర్ వివేకానంద విక్రాంత్, అను ,విజయ్, శ్రీను లు పాల్గొన్నారు. ఈ సినిమా కి రచన : శివ కాకు, సంగీతం:- వి.ఆర్.ఏ.ప్రదీప్, కెమేరా: శివ రాథోడ్, గ్రాఫిక్స్:- రాహుల్ చిల్లలే, నిర్మాత:- తల్లాడ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్:- అశోక్ నిమ్మల, సందీప్ అర్వపల్లి, విజయ్ నెల్లూట్ల, లిరిక్స్:- సంద్యావర్షిణి, చింతల శ్రీనివాస్, శరత్ చంద్ర, రెలా రే రెలా నాగరాజు , పి.ఆర్.ఓ : పాల్ పవన్