
అభిరుచి గల నిర్మాతగా పేరుపొంది, ‘బేబీ’ లాంటి కల్ట్ బ్లాక్‌బస్టర్‌ను అందించి మరోసారి తన జడ్జ్‌మెంట్‌ను నిరూపించుకున్న నిర్మాత ఎస్‌కేఎన్. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన ఈ నిర్మాతకు చిన్న సినిమాలంటే అమితమైన ప్రేమ, గౌరవం. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమా కూడా విజయం సాధించాలని ఆయన ఎప్పుడూ కోరుకుంటాడు. వీలున్నంత వరకు చిన్న సినిమా ప్రమోట్ అవ్వడానికి తన వంతు సహాయం అందిస్తుంటాడు. ఇప్పుడు ఈ కోవలోనే ఇటీవల సంపూర్నేష్ బాబు, సంజోష్‌లు హీరోలుగా నటించిన సోదరా ట్రైలర్ విడుదల వేడుకకు అతిథిగా హాజరైన ఎస్‌కేఎన్, ఈ చిత్రం ఓ స్పెషల్ ప్రీమియర్‌ను తను సొంతంగా థియేటర్ బుక్ చేసుకుని, తన స్నేహితులకు, శ్రెయోభిలాషులకు ఈ సినిమా చూపిస్తానని మాటిచ్చాడు. అయితే సాధారణంగా సినీ పరిశ్రమలో మాట మీద నిలబడటం చాలా తక్కువగా ఉంటుందని, ఒకవేళ ఏదైనా సపోర్ట్ చేస్తామని చెప్పిన అది ప్రకటనల వరకు పరిమితం అవుతుందనే అపోహ కొందరిలో ఉంటుంది. అయితే ఎస్‌కేఎన్ మాత్రం తను ఒక సారి మాట ఇస్తే తప్పకుండా నేరవేరుస్తుంటాడు. ఈ కోవలోనే ఎస్‌కేఎన్ సోదరా చిత్రం స్పెషల్ ప్రీమియర్‌ను తన సొంత ఖర్చుతో ఈ రోజు అనగా గురువారం ఏప్రిల్ 24న సాయంత్రం ఏషియన్ అల్లు అర్జున్ ‘(ఎఎఎ) మల్టీప్లెక్స్ థియేటర్‌లో ఏర్పాటు చేశాడు. సోదరా చిత్రాం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాధారణంగా ఎస్‌కేఎన్ ఎవరికైనా ఆపద ఉందని తెలిసినా ఆర్థికంగా ఆదుకున్న సందర్బాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలోని ప్రతి హీరో అభిమానులకు కూడా వారికి ఏదైనా ఆపద ఉంటే ట్విట్టర్‌లో స్పందించి వారిని ఆదుకున్న ఘటనలు కూడా ఉన్నాయి.