క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చిన గాన కోకిల సుశీల

గత శనివారం ఆరోగ్యం వల్ల గాయని సుశీల హాస్పిటల్ లో జాయిన్ కావడం జరిగింది. అస్వస్థకు గురైన ఆమె చెన్నైలోని కావేరి హాస్పిటల్ లో జాయిన్ కాగా ఆమె ఆరోగ్య పరిస్థితి పరిశీలిస్తూ డాక్టర్లు వైద్యం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడగా ఆమెను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ అయిన సుశీల హాస్పిటల్ నుండి తాను ఆరోగ్యంగా తిరిగి రావడం జరిగింది అంటూ దానికి కారణం మీ అందరి ప్రార్థనలే అని అన్నారు. మీ ప్రార్థన ఫలించబట్టే నేను ఆరోగ్యంగా వచ్చానని, మీరు అందరూ చల్లగా ఉండాలని ఆమె అన్నారు.