త్వ‌రలో హ‌నీమూన్‌కు సునీత దంప‌తులు..

ప్ర‌ముఖ సింగ‌ర్ సునీత తాజాగా త‌న ఇన్‌స్టాలో ఓ సూపర్ పిక్‌ను పోస్ట్ చేసింది. ఇటీవ‌లే మ్యాంగో వీడియోస్ అధినేత రామ్ వీర‌ప‌నేనితో సునీత వివాహం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ వేడుక‌కు ఇరు కుటుంబాల‌కు చెందిన వాళ్ల‌తో పాటు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌రై నూత‌న దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లు తెలియజేశారు. అయితే తాజాగా ఆమె సోఫాలో కూర్చొని కాఫీ తాగుతున్న ఫోటోను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో హ్యాపీ కాఫీ టైమ్ అని రాసి పోస్ట్ చేసింది.

దీంతో సోష‌ల్ మీడియాలో సునీత‌కు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ నెటిజ‌న్లు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఇదిలా ఉంటే.. సునీత కంటే భ‌ర్త రామ్ వ‌య‌స్సులో ఐదేళ్లు పెద్ద‌. ఇద్ద‌రి జోడి అదిరింద‌ని ఇప్ప‌టికే విషెస్ పొందుతున్నారు. ఇక‌ ఈ కొత్త దంప‌తులు త్వ‌ర‌లోనే హ‌నీమూన్‌కి వెళ్ల‌బోతున్నార‌ట‌. దీంతో మొత్తానికి వివాహ జీవితాన్ని మ‌రోసారి సునీత ఎంజాయ్ చేస్తుందంటూ సామాజిక మాధ్య‌మాల్లో నెటిజ‌న్లు కామెంట్స్ పెడుతున్నారు.